నంద్యాల ఉప-ఎన్నిక హోరాహోరీ పోరులో ఇప్పటివరకు ప్రశాంతంగా జరిగిన పోలింగ్ చివరి దశలో గొడవలు చోటు చేసుకున్నాయి. ప్రశాంతం ముగియ నున్న ఆఖరి గంట సమయములో గొడవ చోటు చేసుకుంది. ఏడో వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఆ పార్టీకి గతం లో నంద్యాల ఇన్-చార్జిగా పని చేసిన మల్కి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై గాంధీ నగర్ బూత్ వద్ద దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయనతో పాటు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొందరు గాయపడ్డారు. 


Related image


ఈ గొడవకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గాంధీ నగర్ లో కొంతమంది దొంగ ఓట్లు వేస్తున్నారని బూత్ లో వైకాపా ఏజెంట్ తన అభ్యంతరం తెలిపారు. దాదాపు ముప్పై మంది నంద్యాల నాన్ లోకల్ వ్యక్తులు ఓట్లు వేస్తున్నారని, వైకాపా ఏజెంట్ అభ్యంతరం తెలపడంతో, ఎన్నికల పరిశీలకుడు పరిశీలించి, వారిలో కొందరిని వెనక్కు పంపారు. అలా వెనక్కు వెళ్లిన వారిని, టీడీపీ నేత ఫరూక్ తిరిగి వాళ్లందరినీ ఒక వాహనంలో అక్కడకు తీసుకురావడం జరిగిందని సమాచారం. ఇదే సమయంలో అక్కడకు వైకాపా నేతలు కూడా చేరుకున్నారు.


ఇరు వర్గాలూ ఎదురుపడటం, ఆ ఓటర్ల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసుకోవడం, చివరకు పరస్పరం ఢీ అంటే ఢీ అంటూ బాహా బాహీకి దిగినట్టు సమాచారం. ఈ ఘటనలో మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వల్పంగా గాయపడగా, మరికొందరు వైకాపా కార్యకర్తలు తీవ్రంగా గాయపడినట్టుగా సమాచారం. ఈ అంశంపై ఈసీ, పోలీసులు ఇంకా స్పందించాల్సి ఉంది. ఉప ఎన్నిక పోలింగ్‌ ముగియయడానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ అధికార తెలుగుదేశం పార్టీ అక్రమాలు తారాస్థాయికి చేరాయని, పొరుగు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన దొంగ ఓటర్లను రంగంలోకి దింపిందని, వైసిపి ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే, ఆ దొంగ ఓటర్లను ఎన్నికల పరిశీలకులు పట్టుకోవడం ఇప్పుడు సంచలనం గా మారింది.


నంద్యాల: అడ్డంగా దొరికిన టీడీపీ దొంగ ఓటర్లు



అలాగే నంద్యాలలోని నందమూరి నగర్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద కూడా 10మంది టీడీపీ దొంగ ఓటర్లను ఎన్నికల పరిశీలకులు పట్టుకున్నారు. ఈ దృశ్యాలను చూసి మరో 20 మంది దొంగ ఓటర్లు అక్కడి నుంచి పారిపోయారు. పోలింగ్‌ కేంద్రానికి సమీపం లో 'టాటా ఏస్‌' వాహనంలో కూర్చొన్న కొందరు మహిళలు, ఓట్ల గురించి, ఓటు వెయ్యటం గురించి అనుమానాస్పదంగా మాట్లాడుకుంటుండగా స్థానికులు గుర్తించారు. "అమ్మా, మీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు?" అని స్థానికులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పటం తో స్థానికులు ఎన్నికల పర్యవేక్షకులకు సమాచారం అంచారు.


అధికారులు వచ్చి, ఆ మహిళల దగ్గరున్న ఆధార్‌, రేషన్‌, ఇతర కార్డులను పరిశీలించగా, వారు నంద్యాల వాసులు కాదని తేలిపోయింది. భూమా కుటుంబ సభ్యులు చెబితేనే తాము ఓట్లు వేయడానికి వచ్చామని వారు అధికారులతో చెప్పారు. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకున్న అధికారలు, దొంగ తనంగా ఓట్లేయటానికి వచ్చిన దొంగ ఓటర్లను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: