నంద్యాల ఉపఎన్నిక రోజు వైసీపీ పరిస్థితి బాగాలేనట్టుంది. ఓ వైపు ఎన్నిక జరుగుతండగానే ఆ పార్టీ అధినేత జగన్ పైన కేసు నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ తర్వాత కాసేపటికే సాక్షి టీవీపైన కూడా కేసు నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ఆదేశించారు.

Image result for nandyal bypoll

        ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళి పరిధిలోకే వస్తాయని సీఈసీ తేల్చింది. వెంటనే అధికారులను కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. సీఈసీ ఆదేశాల మేరకు నంద్యాల త్రీటౌన్ పోలీస్టేషన్ లో కేసు నమోదు చేశారు.

Image result for sakshi tv

        ఆ తర్వాత కాసేపటికే సాక్షి టీవీపైన కూడా కేసు నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ఆదేశించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో వైసీపీ అభ్యర్థుల తరపున సాక్షి టీవీ ప్రచారం చేసిందంటూ టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన భన్వర్ లాల్ సాక్షి టీవీ ఎన్నికల నియమావళి ఉల్లంఘించిందని నిర్ధారించి కేసు నమోదుకు ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: