ప్రపంచంలో టెక్నాలజీ ఎంతగా పెరిగిపోతుందో అదే స్థాయిలో దాని వల్ల ప్రమాదాలు కూడా పొంచి ఉంటున్నాయి.  దీనికి ఉదాహారణే ఈ మద్య బ్లూ వేల్‌ చాలెంజ్‌’ ఆన్‌లైన్‌ గేమ్‌ వల్ల ఎన్ని దారుణాలు జరిగాయో ప్రతిరోజూ చూస్తునే ఉన్నాం.  చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఈ గేమ్ షోకి బలైపోతున్నారు.  ఈ మద్య  ఓ బ్యాంక్‌ లో ఉద్యోగిగా పనిచేస్తున్న ప్రియ అనే యువతి ‘బ్లూ వేల్‌ చాలెంజ్‌’ చూస్తున్నట్లు తన ఫ్రెండ్ కి తెలియడంతో ఆ యువతి నెంబర్ పోలీసులకు ఇచ్చింది.  
Image result for బ్లూ వేల్ గేమ్
పోలీసులు నిఘా పెట్టగా..సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా ప్రియ పుదుచ్చేరి సముద్రతీరంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు..ఆత్మహత్య చేసుకోకుండా కాపాడగలిగారు.  మొబైల్‌ వాడుతున్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, బ్లూ వేల్‌ గేమ్‌ ఆడేవారి వివరాలను వెంటనే తెలియజేయాలని పోలీసులు ప్రచారం చేపట్టారు.
Image result for బ్లూ వేల్ గేమ్
తాజాగా  బ్లూ వేల్ గేమ్ ఆడుతూ 17 ఏళ్ళ ఓ అమ్మాయి సరస్సులో దూకేసింది. రాజస్థాన్ లోని జోద్ పూర్ లో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో పోలీసులు ఆ యువతిని రక్షించారు. బీఎస్‌ఎఫ్‌ జవాను కుమార్తె అయిన ఆమె త‌న స్కూటీ తీసుకుని బ‌య‌ట‌కు వెళ్లి ఎంత‌కూ తిరిగి రాలేదు. ఆమెకు తల్లిదండ్రులు ఫోన్ చేయ‌గా గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఫోన్ లిఫ్ట్ చేశాడు.
Image result for బ్లూ వేల్ గేమ్
సిగ్నల్స్ ఆధారంగా  ఆ బాలిక ఉన్న ప్రదేశానికి వెళ్లి చూడగా ఎత్తైన కొండపై ఆ బాలిక నడుచుకుంటూ వెళ్తుంది. ఆమెను కింద‌కి రమ్మ‌ని అంద‌రూ పిలిచారు. అయిన‌ప్ప‌టికీ ఆమె ముందుకు వెళ్లి అక్కడి నుంచి సరస్సులోకి దూకేసింది.  వెంటనే తేరుకున్న పోలీసులు ఆ అమ్మాయిని రక్షించిన తల్లిదండ్రులకు అప్పగించారు. ఆమె చేతిపై కత్తితో బ్లూవేల్ గుర్తు కనిపించింది. తాను బ్లూవేల్ గేమ్ ఆడి చివ‌రి టాస్క్‌కు చేరుకున్న‌ట్లు ఆమె చెప్పింది.   



మరింత సమాచారం తెలుసుకోండి: