ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో భీతావాహం సృష్టించిన హరికేన్ ఇర్మా ప్రభావం ఫ్లోరిడాపై ఇంకా కొనసాగుతోంది.  ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వార్తలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు.  గత వారం కరీబియన్‌ దీవులతో పాటు హోస్టన్‌ నగరాన్ని ముంచెత్తిన ఇర్మా తుపాను ఇప్పుడు ఫ్లోరిడాను వరదనీటితో ముంచెత్తింది.  తుపాను ప్రభావిత ప్రాంతాలుగా భావిస్తున్న ఫ్లోరిడా తీర ప్రాంతంలో ఇప్పటికే సముద్ర నీటి మట్టం గణనీయంగా పెరిగింది. కరీబియన్‌ దీవుల్లో ఇర్మా తుపాను సృష్టించిన బీభత్సంలో 25 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

ప్రకృతి భీభత్సానికి ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. నైరుతి ఫ్లోరిడాను ఇర్మా కన్ను సమీపించిన వేళ వచ్చిన వీడియోలను, రాడార్ ఇమేజ్ లను చూపిస్తున్న ఓ టీవీ చానల్ యాంకర్ వార్తలు చదువుతూ చెప్పిన మాటలు ఇప్పుడు ఎలాంటి వారి హృదయాలనైనా కరిగించేలా ఉన్నాయి.  . "ఇది నమ్మశక్యంగా లేదు. నేనీ మాటలు అంటున్నానంటే, జరుగుతున్నదేంటో నేను నమ్ముతున్నాను.
Image result for Irma storm surge
కేప్ కోరల్ లోని పార్క్ వే ప్రాంతంలో ఎన్ని ఇళ్లు మిగిలాయో తెలుసా? కేప్ కోరల్ వాయవ్య ప్రాంతం మరింత బీభత్సకరంగా మారింది. 6 నుంచి 9 అడుగుల ఎత్తయిన అలలు విరుచుకుపడుతున్నాయి. ఈ సమయంలో అక్కడ చాలా బీభత్సం జరుగుతోంది"  దాదాపు కన్నీరు పెట్టుకొని మాట్లాడినట్లు కనిపిస్తుంది.

ఇవన్నీ చూస్తుంటే తన హృదయం బద్ధలైందని చెబుతూ ఇర్మా శాటిలైట్ ఇమేజ్ లో ఎరుపు రంగు ప్రాంతాన్ని చూపుతూ, ఇక్కడంతా ఉద్ధృతమైన గాలులు, నీటితో నిండిపోయిందని, ఓ ద్వీపం మొత్తాన్నీ సముద్రం ముంచెత్తిందని చెప్పింది.  ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది. 

Image result for Irma storm surge

ఫ్లోరిడా మీదుగా క్యూబా వైపు పయనిస్తున్న ఇర్మా తుపాను వెంట జోస్‌ అనే మరో తుపాను ప్రారంభమైనట్లు అధికారులు ప్రకటించారు. ఇర్మా తుపాను మార్గంలోనే ఇది కూడా పయనిస్తూ ప్రభావిత ప్రాంతాలలో సహాయ కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇర్మా తుపానుతో దెబ్బతిన్న సెయింట్‌ మార్టిన్‌, సెయింట్‌ బర్త్‌లేమీ ప్రాంతాలలో తుపాను హెచ్చరికలను మరికొంత కాలం కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: