తమిళనాట కొత్త పార్టీ కీ కొత్త రాజకీయ శకానికీ తెర లేవబోతోందా ? అవును అనే అంటోంది అక్కడి మీడియా.ప్రస్తుతం అభిమానులతో సంప్రదింపులు జరుపుతున్న యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఇప్పుడు తమిళ రాజకీయాలలో పెను మార్పులు సృష్టించే దిశగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా కమల్ హాసన్ రాజకీయాలలోకి రాబోతున్నారు అనే వార్తలు ఇంటర్నెట్ లో వెల్లువలా పాకుతున్నాయి.


రజినీకాంత్ కూడా రాజకీయాలలోకి ఈ ఏడాదే రాబోతున్నారు , అయితే కమల్ విషయం లో పార్టీ పెడతారా లేక ఏదైనా ఇప్పటికే ఉన్న పార్టీ లో జాయిన్ అవుతారా అనే విషయాల్లో క్లారిటీ ఉండేది కాదు కానీ ఇప్పుడు కమల్ హాసన్ కూడా పార్టీ పెడుతున్నట్టు దాదాపుగా తేలిపోయింది.


కేరళ ముఖ్యమంత్రిని కూడా రీసెంట్ గా కలిసి ఈ విషయం మీదనే కమల్ హాసన్ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కమల్ తనది కాషాయం రంగు కాదు అంటూ ఎరుపే తన గుర్తు అంటూ కమ్యూనిస్ట్ లాగా మాట్లాడారు.


అయితే మొదట్లో అందరూ ఆయన డీఎంకే లోకి వెళ్లి స్టాలిన్ కి మద్దతు ఇస్తారు అనుకున్నారు కానీ కమల్ మాత్రం ఇప్పుడు కొత్త పార్టీ వైపుకే అడుగులు వేస్తున్నారు. నవంబర్ లో జరిగే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి పార్టీ సంసిద్దమవుతోందని తెలుస్తోంది. సుమారుగా 4000 స్థానిక అభ్యర్థులని నిలబెట్టే అవకాశముందని తెలుస్తోంది.సొంతబలం తెలుసుకోవడం కోసం దసరా నాడు ఈయన పార్టీ ప్రకటించే అవకాశం ఉంది అనేది విశ్లేషకులు చెబుతున్న మాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: