ఎప్పుడైతే ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి ని పీపీపీ స్టైల్ లో కట్టాలి అని ఇంజినీర్ లతో పాటు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుందో, అప్పటి నుంచీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. చాలామంది దీనిమీద వ్యాసాలు సైతం రాసుకుని వచ్చారు. ఏదో ఒక భవనానికి లేదా వంతెన నిర్మాణానికి కనీసం రహదారి నిర్మాణం కోసం ఉపయోగించే పీపీపీ నమూనా మొత్తం ఒక నగరానికి అందులోనూ ప్రతిష్టాత్మకమైన అమరావతి లాంటి కీలక నగరం నిర్మాణానికి అన్వయించడం ఎక్కడా జరిగి ఉండదు.


పేరుకి ప్రభుత్వం తో పాటు ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం అంటున్నారు కానీ ఆచరణలోకి వచ్చేసరికి మొత్తం ప్రైవేటు వారి పెత్తనం ఉంటుంది అనేది ఓపెన్ సీక్రెట్. వారికి ఈ వ్యవహారం లో ఋణం అందించేది కూడా ప్రభుత్వ సంస్థలు , బ్యాంకులే మరి.


ప్రైవేటు కంపెనీ అంటే లాభాల కోసం కాంట్రాక్టులు తీసుకుంటుంది తప్ప పెట్టుబడి పెట్టేసి చక్కా కూర్చోవు ! అందుకే కాబోలు ప్రభుత్వం ఎంత హడావిడి చేసినా దీనికి సంబంధించి అమరావతి లో పనులు ముందర కి కదలడం లేదు.


సో నెమ్మదిగా ఈపీసీ , పీపీపీ విధానాలు పక్కన పెట్టి కొత్తతరహా హైబ్రీడ్ , మిశ్రమ విధానాలు చేపట్టాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైబ్రీడ్‌ ఏన్యుటీ మోడల్‌(హామ్‌) దీంట్లో ప్రభుత్వం 40 శాతం వాటా కలిగివుండి దానికింద ఒకేసారి కాంట్రాక్టరుకు నగదు మొత్తం ఇచ్చేయాలి. మిగితా 60 శాతం కాంట్రాక్టర్ దే అన్నమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: