అంతర్జాతీయం గా అల్-ఖైదా ఉగ్రవాద సంస్థ కు ఆర్ధిక సంపత్తిని చేకూర్చే - భారత్‌కు మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌, అంతర్జాతీయ మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు బ్రిటన్‌ ప్రభుత్వం బలమైన షాక్‌ ఇచ్చింది. ప్రపంచ దేశాలను తన ఉగ్రవాద చర్యలతో ఠారెత్తించే దావూద్‌ ఇబ్రాహింకు పచ్చివెలక్కాయ గొంతులో పడినటైంది. ప్రపంచం లోనే రెండవ అత్యంత సంపన్నుడైన ఈ అంతర్జాతీయ ఉగ్రవాది  (ఇందులో తొలి స్థానం లో 'పాబ్లో ఎస్కోబార్ ఫ్రోజెన్' ఉన్నారు)  గాంగ్-స్టర్ కు చెందిన ఆస్తులను జప్తు చేసి నట్లు యునైటెడ్ కింగ్-డం తెలిపింది. విడుదల చేసిన తన ఆర్థిక ఆంక్షల జాబితాలో ప్రముఖంగా దావూద్‌ ఇబ్రహీం పెద్ద మొత్తంలో ఆధీనంలో ఉన్న భారీ ఆస్తులు బ్రిటన్ ప్రభుత్వం గతనెలలోనే స్వాధీనం చేసుకుంది. 


dawood ibrahim properties in uk కోసం చిత్ర ఫలితం


నరెంద్ర మోడీ భారత ప్రధాని అయిన తరవాత భారత ప్రభుత్వానికి అతి పెద్ద దౌత్య విజయం లభించిందని చెప్పవచ్చు. 


dawood ibrahim properties in uk కోసం చిత్ర ఫలితం


ఈ అంతర్జాతీయ ఉగ్రవాదిని ఐఖ్యరాజ్య సమితి 2013 లోనే గుర్తించింది. భారత్ లో అనేక ఉగ్రవాద కార్యక్రమాల్లో నిందితుడు గా పేరుపడి ప్రభుత్వానికి దశాబ్ఢాల పాటు దొరక్కుండా పాకిస్తాన్ లో స్థిర నివాసం ఏర్పరచుకున్న దావూద్‌ ఇబ్రాహిం కు యుకె లోని వార్విక్‌షైర్‌ లో ఒక హోటల్‌, మిడ్‌ల్యాండ్‌లో పలు నివాస ఆస్తులు ఉన్నాయి. చాలాకాలంగా దావూద్‌ ఇబ్రాహిం పై ఆర్ధిక ఆంక్షలు విధించాలని భారత్‌ బ్రిటన్ ను అభ్యర్దిస్తూ వస్తుంది. అనేక సందర్బాల్లో గుర్తుచేస్తూ దౌత్యపరంగా వత్తిడి చేయగా ఆ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న బ్రిటన్‌ దావూద్‌ ఇబ్రాహిం ఆస్తులను జప్తు చేసింది. 6.7 బిలియన్ డాలర్ల విలువైన నివాస భవనాలతోపాటు ఒక హోటల్‌‌ను జప్తు చేసినట్లు యూకే ప్రభుత్వం పేర్కొంది.


dawood ibrahim properties in uk కోసం చిత్ర ఫలితం


ఎప్పటికప్పుడు బ్రిటన్ ట్రెజరీ డిపార్ట్మెంట్ సవరించే "కన్సాలిడేటెడ్‌ లిస్ట్‌ ఆఫ్‌ ఫైనాన్సియల్‌ సాంక్షన్స్‌ - టార్గెట్స్‌ ఇన్‌ యూకే" లో ఈ విషయాన్ని సోమవారం నాదు ప్రకటించింది. దావూద్‌ ఇబ్రాహిం కు పాకిస్తాన్‌ -కరాచీ లో మూడు అధికారిక చిరునామాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ మూడూ ఒక్క కరాచీలోనే ఉన్నట్లు వెల్లడించారు. దావూద్‌ ఇబ్రాహిం కు మొత్తం అంతర్జాతీయంగా 21 మారుపేర్లు ఉన్నట్టు ఇందులో ప్రస్తావించారు. దావూద్‌ పుట్టింది మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాంతంలో


1993 ముంబై వరస పేలుళ్లు తర్వాత ఇతను మనదేశాన్ని వదిలిపెట్టి పాకిస్తాన్ పారిపోయాడు. అప్పటినుండి డి కంపెనీకి పాక్ కేంద్రమైంది. అల్ ఖైదా, లష్కరే తొయిబా లాంటి మత ఛాందస సంస్థలతో దావూద్ బంధం అక్కడ నుంచే ప్రారంభమైంది. ఒసామా బిన్ లాడెన్‌తో దావూద్‌కు సాన్నిహిత్యం ఉందని అమెరికా బయటపెట్టింది. అఫ్ఘానిస్థాన్ నుంచి అల్‌ఖైదా సభ్యులు పారిపోవడానికి దావూద్ దారి చూపించాడు. 1993 ముంబై వరస పేలుళ్లు తర్వాత ఇతను మనదేశాన్ని వదిలిపెట్టి పాకిస్తాన్ పారిపోయాడు. అప్పటినుండి డి కంపెనీకి పాక్ కేంద్రమైంది.



దావూద్ ఇబ్రాహిం 70% బాలీవుడ్ సినిమా పైరసీని నియంత్రిస్తూ మిలియన్ల డాలర్లను బాలీవుడ్ నుండి వసూళ్ళు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. దావూద్ ఇతర ముఖ్య చట్ట విరుద్ద కార్యక్రమాలు, ఉగ్రవాదులకు ఆర్ధిక అండ కలిగించటం, అక్రమ మానవ తరలింపులు, పెద్ద మొత్తం లో నార్కోటిక్ సరపరా నిర్వహణ, దొంగ నోట్ల ముద్రణ, ఐపిఎల్ మాచ్ ఫిక్క్సింగ్, బెట్టింగ్  తదితరాలు ఈ కార్యక్రమాలన్నీ దుబాయి కేంద్రంగా నడుస్థాయి. 

dawood ibrahim properties in uk కోసం చిత్ర ఫలితం

Kaskar Dawood Ibrahim, 61, an Indian national, goes by 21 aliases and is the second richest criminal ever

మరింత సమాచారం తెలుసుకోండి: