కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒకప్పటికి, ఇప్పటికి చాలా మారిపోయింది. దాని పరిస్థితి ఊహించుకుంటేనే జాలేస్తుంది. కేంద్రంలో అయినా, ఏపీలో అయినా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతూనే ఉంది. ఇక ఏపీలో అయితే దాని పేరెత్తితేనే జనాలు పారిపోయే పరిస్థితి నెలకొంది. ఎన్నికలు జరిగి మూడేళ్లయినా హస్తవాసి ఏమాత్రం అనుకూలంగా ఉన్నట్టు కనిపించడం లేదు.

Image result for ap congress

          2014 ఎన్నికలకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా ఉండేది. అప్పుడు కాంగ్రెస్, టీడీపీ మధ్య పోటాపోటీ ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక ఏపీలో ఆ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. గత ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. మూడేళ్ల తర్వాత జరిగిన నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది.

Image result for ap congress

          ఈ నేపథ్యంలో తమ పార్టీపై ప్రజలకు ఇంకా కోపం పోలేదనే భావనకు వచ్చారు కాంగ్రెస్ నేతలు. మూడేళ్ల తర్వాత కూడా రాష్ట్రాన్ని విడగొట్టామనే ఫీలింగ్ నుంచి ప్రజలు బయటకు రాలేదని.. ఇది బాధాకరమని నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే జరిగినదానికి క్షమాపణ చెప్పి చెంపలేసుకుంటే మంచిదనేది కాంగ్రెస్ పెద్దల ఆలోచన. రాష్ట్ర నేతలు కాకుండా.. స్వయంగా సోనియా, రాహుల్ చేతే క్షమాపణ కోరడం ద్వారా ఇంతోకొంతో మేలు జరుగుతుందని రాష్ట్ర పెద్దలు భావిస్తున్నారు.

Image result for ap congress

          అయితే క్షమాపణ చెప్పేందుకు సోనియా, రాహుల్ ఒప్పుకుంటారా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. కానీ సోనియా, రాహుల్ సారీ చెప్తే బాగుంటుందని రఘువీరా తదితరులు చెప్పగానే పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే రాష్ట్రంలో పరిస్థితిని పూర్తిగా వివరించిన తర్వాత ఆ నిర్ణయాన్ని సోనియా, రాహుల్ లకే విడిచిపెడదామనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: