ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత జెండా పీకేసి కాంగ్రెస్ పార్టీలో కలిపేసిన మెగాస్టార్ చిరంజీవి రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకంటున్నాయి. వచ్చే మార్చిలో ఎంపీ పదవీకాలం ముగియనుంది. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో కాలం చెల్లడంతో ఇక ఆ పార్టీలో ఉండడం ఏమాత్రం సమంజసం కాదనే భావనకు చిరంజీవి వచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై అనుచరుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇంతకూ ఆ అనుచరులెవరో తెలుసా..?

Image result for chiranjeevi

                చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే తమకు తిరుగుండదని భావించిన కాపులకు మెగాస్టార్ ఏమాత్రం ఉపయోగపడలేకపోయారు. పార్టీ పెట్టి కనీసం రెండేళ్లు కూడా నడపలేక కాంగ్రెస్ ముందు మోకరిల్లారు. అందుకు ప్రతిఫలంగా తాను ఎంపీ అయ్యారు. ఆ పదవి కూడా వచ్చే మార్చితో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆయన్ను రాజ్యసభకు కాంగ్రెస పార్టీ పంపుతుందని ఆశించడం అత్యాశే అవుతుంది. ఎందుకంటే ఆ పార్టీకి అంత సీన్ లేదు. దీంతో చిరంజీవి భవిష్యత్ ఏంటనేదానిపై అనుచరులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Image result for chiranjeevi

          చిరంజీవిపై ఎంతో అభిమానంతో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ తర్వాత విధిలేని పరిస్థితుల్లో వివిధ పార్టీలను ఆశ్రయించిన ఆయన అనుచరులు.. ఇప్పుడు మళ్లీ మెగాస్టార్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇక కాలం చెల్లినందున ఏదో ఒక పార్టీలో చేరాలని ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యంగా మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు.. చిరంజీవిని టీడీపీలోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదే సమయంలో వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా ఏదో ఒక పార్టీలో చేరాల్సిందిగా అభ్యర్థిస్తున్నట్టు సమాచారం. వీరిద్దరూ ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

Image result for chiranjeevi

          మరోవైపు.. ప్రజారాజ్యం పార్టీ తరపున గెలిచి ఆ తర్వాత వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కన్నబాబు.. చిరంజీవిని వైసీపీలో చేరాల్సిందిగా పట్టుబడుతున్నారు. ఇదే విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఓసారి చిరంజీవితో మాట్లాడితే బాగుంటుందని ఆయన జగన్ కు సూచించినట్లు తెలుస్తోంది. అయితే మొదట చిరంజీవి అభిప్రాయాన్ని తెలుసుకోవాలని జగన్ అభిప్రాయపడ్డారట. దీంతో కన్నబాబు చిరంజీవి మనసులో మాటకోసం ఎదురుచూస్తున్నారు. మరి చిరంజీవి ఏం చేస్తారో చూడాలి..!


మరింత సమాచారం తెలుసుకోండి: