రాష్ట్ర విభజన తర్వాత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ ఇక ఏపీపై పూర్తిగా ఆశలు వదిలేసుకున్నట్టే కనిపిస్తోంది.  నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత మరింత క్లారిటీ వచ్చినట్టు సమాచారం. అందుకే ఏపీపై అనవసరంగా ఆలోచించడం మానేసి తెలంగాణపై దృష్టిపెడితే కాస్తో కూస్తో ఫలితం ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

 Image result for AP CONGRESS

కాంగ్రెస్ అధిష్టానానికి రెండు తెలుగు రాష్ట్రాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ లో ఒక్కటంటే ఒక్క సీటు రాకపోయే సరికి పూర్తిగా చతికిల పడింది కాంగ్రెస్. మరోవైపు తెలంగాణ ఇచ్చినా కూడా అక్కడా అధికారం రాకపోయే సరికి మరింత నీరుగారి పోయింది. తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది మేమే అని నెత్తీనోరు కొట్టుకున్నా ప్రజలు మాత్రం ప్రతిపక్షంలోనే కూర్చోబెట్టే సరికి ఉస్సూరుమన్నారు.. అయిందేదో అయిపోయింది.. ఏదో ఒకసారి మంచి టైం వస్తుందిలే అనుకుని సర్దుకుపోతున్నా.. ఆ టైం రాక ఎప్పటికప్పుడు నిరాశే ఎదురవుతోంది.

 Image result for AP CONGRESS

రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ఒక్క సీటు గెలవలేకపోయినా మెల్లమెల్లగా పరిస్థితులు చక్కదిద్దుకుంటాయని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. అందుకు అనుగుణంగానే ప్రజా సమస్యలపై ఆందోళనలు.. పోరాటాలు చేసే విధంగా రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తూ వచ్చింది. అందులో భాగంగానే ప్రత్యేక హోదా మొదలు అనేక అంశాలపై కాంగ్రెస్ నేతలు గల్లీ నుంచి దిల్లీ దాకా ఎన్నో కార్యక్రమాలు చేశారు. అయినా ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఉన్న వ్యతిరేక భావన ఏమాత్రం తొలగిపోయినట్లు కనిపించలేదు.. రాజధాని కూడా లేకుండా తమను రోడ్డు పాలు చేసారన్న ఆగ్రహాన్ని నంద్యాల ఉప ఎన్నికలో ఏపీ ఓటర్లు స్పష్టంగా చూపించారు.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్దికి కేవలం వెయ్యి పై చిలుకు ఓట్లు మాత్రమే రావడం రాష్ట్ర నేతలతో పాటు హైకమాండ్ ను ఖంగుతినేలా చేసింది... నంద్యాల బైపోల్ లో వచ్చిన ఓట్లు చూశాక ఇక ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో కోలుకోలేమనే నిర్ధారణకు వచ్చిందంట హైకమాండ్.. అందుకే ఏపీలో పార్టీ కార్యకలాపాలు వేస్ట్ అని భావిస్తోందంట!

 Image result for AP CONGRESS

అందుకే  తెలంగాణపైనే పూర్తి దృష్టి సారించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు ఆపార్టీ నేతలు చెప్తున్నారు.. రెండు తెలుగు రాష్ట్రాలపై పెట్టే ఎఫర్ట్స్ ను ఒక్క తెలంగాణపై మాత్రమే పెడితే ఎంతోకొంత ఫలితం దక్కుతుందని డిసైడ్ అయ్యారట కాంగ్రెస్ పెద్దలు.. తెలంగాణలో ఇప్పుడు ఎలాగూ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి.. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలని చూస్తున్నారు.. అందులో భాగంగా పార్టీలో సమూల మార్పులు చేయడం.. వీలైనంత ఎక్కువ మంది నేతలకు పార్టీ పదవులను కట్టబెట్టడం వంటి స్ట్రాటజీపై అధిష్టానం దృష్టి పెట్టింది. కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంతో పాటు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తే కనీసం తెలంగాణలోనైనా సక్సెస్ అవుతామని హైకమాండ్ గట్టిగా నమ్ముతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: