తెలంగాణా లో జెనెరల్ ఎలక్షన్ ఎప్పుడు ఉంటుందో ఎవ్వరికీ తెలీదు కానీ సర్వే ల గొడవ మాత్రం గట్టిగా మొదలైంది. అధికార ప్రతిపక్ష పార్టీలు పోటీ పడుతూ ఏదో ఒక సర్వే చేయించాం అనీ తమ పార్టీ కే జనాల మద్దతు ఉంది అనీ చెప్పుకుంటున్నారు.


ఆ మధ్య తెరాస చేయించిన సర్వే లో టాప్ పొజిషన్ లో తెరాస ఉంటూ రెండో పొజిషన్ లో కాంగ్రెస్ ఉంది అన్న విషయం తెరాస శ్రేణులు ప్రకటించిన సంగతి తెలిసిందే .. తాజాగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ తరఫున చేయించిన సర్వే లో తెలంగాణా లో కాంగ్రెస్ గట్టిగానే ఉంటుంది అనీ దాదాపు ఎనభై స్థానాలు దక్కే ఛాన్స్ ఉంది అనీ కాస్త కష్టపడితే ఇంకా ఎక్కువ సాధించచ్చు అనీ తేలిందట.


రాహుల్ తన సర్వే లో రెండో స్థానం తెరాస కి ఇచ్చారు. ఆ పార్టీ ఒక 28 స్థానాలు దక్కించుకుంటుంది అంటున్నారు యువరాజు. ఇక‌, తెలుగుదేశం పార్టీకి మ‌హా అయితే ఐదు సీట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తాజాగా కాంగ్రెస్ స‌ర్వే తేల్చింది.


ఏదేమైనా, ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి కావాల్సిన క‌నీస సంఖ్యా బ‌లాన్ని కాంగ్రెస్ సునాయాసంగా చేరుకుంటుంద‌నేది ఈ స‌ర్వే అంతిమ ఫ‌లితం. ఇలాంటి సర్వే ల మీద కెసిఆర్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: