కాపు రిజర్వేషన్ లకి సంబంధించి ఈ ఏడాది ఆఖర్లో కానీ వచ్చే నెలల్లో కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టి నిర్ణయం తీసుకుంటారు అని తాను అనుకుంటున్నట్టు ముద్రగడ పద్మనాభం స్పష్టంగా చెబుతున్నారు.


ఇదివరకు మూడు నెలల గ్యాప్ అన్న ముద్రగడ ఇప్పుడు పొడిగించి నాల్గవ నెలకి తోసేసారు. అంటే డిసెంబర్ వరకూ ఆయన సైలెంట్ గా ఉంటారు అన్నమాట. కొత్త సంవత్సరం లో ఎన్నికల వాతావరణం రాగానే ఆయన కూడా ఎంటర్ అవుతారు.


ఆ గ్యాప్ తరవాత తీవ్రమైన  కార్యాచరణ చేపడతారా ? అంటే డౌట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారి అంత గ్యాప్ ఇచ్చిన తరవాత ఆ ఊపు , ఆ నమ్మకం కాపు వర్గం ముద్రగడ మీద పెడుతుందో లేదో తెలీని పరిస్థితి.


తన సొంత జిల్లా కాకినాడ లో టీడీపీ ఎన్నికలు జరుపుతుంటే ముద్రగడ ప్రభావం చూపించలేక పోవడం ఆయన జోరు కి పగ్గాలు వేసిన మొట్టమొదటి నిర్ణయం అంటున్నారు. ఏదో ఒక రకంగా ఆయన్ని తొక్కాలని చూస్తున్నా ముద్రగడ గట్టి యుద్ధం చేస్తే ఖచ్చితంగా మీడియా , కాపుల సపోర్ట్ ఉంటుంది, అసలే తొక్కేస్తున్నారు అనుకుంటున్న టైం లో ముద్రగడ ఇంకా ఇంకా సైలెంట్ అయిపోయారు .. ఇది ఆయన భవిష్యత్తు కి ఉపయోగపడే నిర్ణయం అయితే కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: