ఎప్పుడూ లేనంత హడావిడి గా తెలుగు భాషని ఉద్దరించాలి అనే ఫీలింగ్ తో తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ బయలు దేరారు. 12 వ తరగతి వరకూ అన్ని స్కూల్స్ లో తెలుగు ఒక సబ్జెక్ట్ గా ఉండాల్సిందే అంటూ ఆయన కొత్త జేవో ని తీసుకొచ్చే పనిలో బిజీ గా ఉన్నారు. ఈ నిర్ణయం చూస్తే తెలుగు భాష మీద ఆయనకి ఉన్న మమకారం, చిత్తశుద్ధి కనిపిస్తాయి.


మాతృ భాష మీద మమకారం ఉండీ , ఆ భాష నాశనం అయిపోతుంది అనుకున్నవారు అందరికీ ఈ డెసిషన్ చాలా గ్రాండ్ గా కనిపిస్తోంది. సోషల్ మీడియా లో అయితే కేసిఆర్ ని ఆకాశానికి ఎత్తేసారు, ఒకే ఒక్క నిర్ణయం తో తెలుగు భాషా ప్రేమికులు అందిరికీ కేసిఆర్ ఫేవరేట్ రాజకీయ నాయకుడు అయ్యారు.


అలాగే సోషల్ మీడియా లో కేసిఆర్ కి వస్తున్న విజ్ఞప్తులు కూడా పెరుగుతున్నాయి. ఈ మధ్య కాలం లో తెలుగు సినిమా పేర్లు అన్నీ కూడా ఇంగ్లిష్ లోనే ఉంటూ ఉండడం విశేషం.


తెలుగు సినిమా పేర్లు అన్నీ తెలుగు లోనే ఉండాలి అన్న షరతు కేసిఆర్ మాత్రమే తీసుకోగలరు అనీ అలా తీసుకుంటే చాలా భాగుంటుంది అనీ అంటున్నారు తెలుగు ప్రేమికులు.త‌మిళ‌నాట ఈ సంప్ర‌దాయం ఉంది. వాళ్ల పేర్ల‌న్నీ త‌మిళంలోనే ఉండాలి. త‌మిళ సినిమాకి త‌మిళ పేరు పెడితే టాక్స్ లో మిన‌హాయింపు ఇస్తుంది అక్క‌డి ప్ర‌భుత్వం. తెలంగాణా ప్రభుత్వం కూడా ఇలాంటిది ప్రయత్నిస్తే బాగుంటుంది కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: