నిత్యం వివాదాలలో ఉండడం తమిళ , తెలుగు హీరో కమల్ హాసన్ కి కొత్త విషయం ఏమీ కాదు. ఆయన రాజకీయాలలోకి రాబోతున్నారు అనే న్యూస్ తెలిసిన దగ్గర నుంచీ అనేక సార్లు అనేకమంది ఆయనని విమర్శించడం , ప్రభుత్వం మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలు చెయ్యడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయ్.


తాజాగా ఆయన మీడియా తో మాట్లాడుతూ తాను కొత్త పార్టీ పెడుతున్నా అని ప్రకటించిన దగ్గర నుంచీ తనని చంపేస్తా అంటూ ఫోన్ లు వస్తున్నాయి అని చెప్పుకొచ్చారు. " నేను ఏ పార్టీ లోనూ చేరడం లేదు, నాకంటూ కొత్త పార్టీ పెడుతున్నా.


ఈ ఏడాది నవంబర్ లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కూడా చేస్తాను  " అని ప్రకటించారు .. " దేశం లో మార్పు అవసరం , అందుకే నేను రాజకీయాలలోకి రావడానికి నా అభిమానుల సహాయంతో సిద్ధం అయ్యాను.


అయితే ఇది చాలామందికి నచ్చడం లేదు .. నన్ను చంపేస్తాం అంటున్నారు. పార్టీ పెట్టద్దు అనేది వారి ప్రధాన వాదన " అంటూ చెప్పుకొచ్చారు కమల్. తాను భయపడే రకాన్ని కాను అనీ పార్టీ పెట్టి తీరతాను అంటున్నారు కమల్ హాసన్.

మరింత సమాచారం తెలుసుకోండి: