తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏపీలో ఫుల్ జోష్ లో ఉంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో గెలవడం, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేస్తుండడంతో పార్టీలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. పార్టీ చేపట్టిన ఐవీఆర్ఎస్ సర్వే కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుండడంతో వచ్చేసారి కూడా తమదే అధికారం అనుకుంటోంది. అయితే వైసీపీ నుంచి వలసలను ప్రోత్సహించాలనుకుంటోంది.

Image result for ycp jumping mlas

        వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే 175 సీట్లూ సాధించాలనేది టార్గెట్. అయితే వైసీపీని మాత్రం ఖాళీ చేయాలనుకుంటోంది. కానీ ఇప్పటికైతే ఆరుగురు ఎమ్మెల్యేలను మాత్రం పార్టీలోకి చేర్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. తమతో సుమారు 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని టీడీపీ నేతలు చెప్తున్నా.. అందరినీ చేర్చుకునే ఉద్దేశం లేనట్టు  కనిపిస్తోంది.

Image result for ycp mlas

        కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలను మాత్రమే టీడీపీ ఎందుకు చేర్చుకోవాలనుకుంటోంది? దీని వెనుక పెద్ద వ్యూహమే కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఏపీలో 4 రాజ్యసభ స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత బలాబలాలను బట్టి టీడీపీకి 3, వైసీపీకి ఒక స్థానం దక్కుతాయి. ఒక్కో ఎంపీని ఎన్నుకోవడానికి 44 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఇప్పుడు వైసీపీకి 46 మంది ఎమ్మెల్యేలున్నారు.

Image result for ycp mlas

        46 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఓ స్థానం వైసీపీకి సునాయాసంగా దక్కుతుంది. అయితే ఆ ఒక్క సీటును కూడా వైసీపీకి వెళ్లకుండా చేయాలని టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా చేయాలంటే వైసీపీలో 44 ఎమ్మెల్యేలకంటే తక్కువ ఉండేలా చూడాలి. అయితే ద్వితీయప్రాధాన్య ఓట్లు.. తదితర తలనొప్పులు ఉండొచ్చు. అందుకే ఏకంగా ఆరుగురిని లాగేసుకుంటే అప్పుడు వైసీపీ దగ్గర 40 మంది మాత్రమే ఉంటారు. అప్పుడు ఆ ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్లే ఛాన్సే లేదు. అందుకే ఆ ఆరుగురిపై టీడీపీ కన్నేసింది. మరి వైసీపీ ఏం చేస్తుందో చూద్దాం..!


మరింత సమాచారం తెలుసుకోండి: