ఎంపీగా కంటే మెగాస్టార్‌గానే త‌న‌ను పిలిపించుకోవ‌డానికి ఎక్కువ ఇష్ట‌ప‌డుతున్నారు చిరంజీవి! 2014 ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభ‌వం త‌ర్వాత‌.. కాంగ్రెస్‌కు దూరంగా సినిమాల‌కు ద‌గ్గ‌ర‌గా అడుగులు వేస్తున్నారు మెగాస్టార్‌. ఒక‌ప‌క్క త‌మ్ముడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీని స్థాపించి బ‌రిలోకి దిగ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలో.. ఇప్పుడు చిరంజీవి పేరు పొలిటిక‌ల్ స్క్రీన్‌పై మ‌ళ్లీ వినిపిస్తోంది. త‌మ్ముడిని అక్కున చేర్చుకున్న‌ట్టే అన్న‌ను కూడా ప‌క్క‌నే పెట్టుకోవాల‌ని సీఎం చంద్ర‌బాబు, మ‌రోప‌క్క జ‌గ‌న్ కూడా ప్ర‌య‌త్నా లు చేస్తున్నారు! ఇదే స‌మ‌యంలో టీడీపీ ఒక బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది! ఆయ‌న‌కు స‌న్నిహితంగా ఉండే మంత్రి ఇప్పుడు ఈ విష‌యంపై చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని స‌మాచారం!!

megastar chiranjeevi కోసం చిత్ర ఫలితం

ప్ర‌జారాజ్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టిస్తాడనుకున్న చిరంజీవి.. అట్టర్ ప్లాప్ అయ్యారు. తర్వాత‌ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం.. ఏపీలో కాంగ్రెస్‌కు అండ‌గా చిరు ఉంటాడ‌ని ఆయ‌నపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎన్నోఆశ‌లు పెట్టుకుంది అధిష్ఠానం. వాటిని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా తన‌మానాన సినిమాలు చేసుకుంటూ బిజీబిజీ అయిపోతున్నాడు!! ఇక రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పేసినా ఆశ్చ‌ర్యం లేద‌నే వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేసేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయన పొలిటిక‌ల్ కెరీర్‌పై చిరు ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం! 


విభ‌జ‌న అనంత‌రం ఏపీలో కుల రాజ‌కీయాలు కీల‌కంగా మారాయి. ముఖ్యంగా కాపు సామాజిక‌వర్గం కీల‌కంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే అటు టీడీపీ, ఇటు వైసీపీలు చిరుపై క‌న్నేశాయి. కాంగ్రెస్ కి కూడా దూరంగా ఉంటున్న చిరు రాజ్యసభ సభ్యత్వ గడువు కూడా త్వరలో ముగిసిపోనుంది. నంద్యాల, కాకినాడ ఫలితాల తర్వాత ఏపీ రాజకీయాల్లో వస్తున్న మార్పుల్ని ప‌రిశీలిస్తున్నార‌ని తెలుస్తోంది. అదే సమయంలో ఇటు అధికార టీడీపీ, అటు విపక్ష వైసీపీ నుంచి చిరుకి తాజాగా కూడా ఆహ్వానాలు అందాయ‌ట‌. టీడీపీ తరపున గంటా శ్రీనివాసరావు చిరంజీవిని తమ పార్టీలోకి వస్తే బాగుంటుందని చెప్పారట. రాజ్యసభ స్థానంతో పాటు ఎన్డీఏలో మంత్రిగా అవకాశం క‌ల్పిస్తామ‌ని వివ‌రించార‌ట‌. 

ganta srinivasa rao కోసం చిత్ర ఫలితం

ఇక వ‌రుస ప‌రాభ‌వాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న వైసీపీ కూడా మెగాస్టార్ కి ఓపెన్ ఆఫర్ ఇచ్చిందట. పార్టీలో ఆయన కోరుకున్న స్థానం ఇవ్వడానికి రెడీ అని చెప్పిందట. పైగా తాను అనుకున్న వారికి ఓ ఐదు అసెంబ్లీ సీట్లు కూడా ఇస్తామని కూడా చెప్పిందట. అయితే అన్ని విషయాలు విన్నాక త్వరలో తన నిర్ణయం వెల్లడిస్తానని చిరు రెండు పార్టీలకి జవాబు ఇచ్చారట. అయితే ఆయ‌న రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్ప‌డానికి డిసైడ్ అయ్యార‌నే వార్త‌లు కూడా గుప్పుమంటున్నాయి. త‌మ్ముడు కూడా టీడీపీకే మ‌ద్ద‌తు తెలుపుతుండ‌టంతో.. అన్న కూడా అటువైపు వెళ‌తారో.. లేక కొత్త దారిలో వెళ‌తారో.. ఆయ‌న ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. సంచ‌ల‌న‌మే! 


మరింత సమాచారం తెలుసుకోండి: