పవన్ కళ్యాణ్ తన జనాసేన పార్టీ పెట్టి మూడు సంవత్సరాలు అవుతోంది. గడిచిన సార్వత్రిక ఎన్నిక టైం లో పార్టీ పెడుతున్నా అంటూ ప్రకటన చేసిన పవర్ స్టార్ .. అప్పట్లో 2014 టైం లో హడావిడి గా పార్టీ పెట్టేసాడు కానీ పోటీ మాత్రం చెయ్యలేదు. టీడీపీ - బీజేపీ కూటమికి పూర్తి మద్దతు ఇచ్చి వారికోసం పూర్తిగా ప్రచారం కూడా చేసాడు.


ఆ తరవాత నుంచీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసమే తమ పార్టీ ఉంది అంటూ పవన్ కళ్యాణ్ చెబుతూ వచ్చాడు. సమస్యల విషయం లో పవన్ కళ్యాణ్ స్పందిస్తున్న తీరు ఖచ్చితంగా మంచి వ్యవహారమే అని చెప్పాలి. అయితే రిజల్ట్ ల విషయం మాత్రం పవన్ నామమాత్రంగా చూస్తూ ఉండిపోతున్నాడు .


ప్రత్యేక హోదా వివాదం దగ్గర నుంచీ , ఉద్దానం, అగ్రీ గోల్డ్, రాజధాని రైతుల సమస్యలు, ఆక్వా రైతులు, వ్యవసాయ విద్యార్ధులు ఇలా చెప్పుకోదగ్గ పోరాటాల మీద పవన్ స్పందించాడు. అయితే కొన్నింట రిజల్ట్స్ రావడం మిగితావి పవన్ పక్కకి పెట్టేయడం విమర్సలకి దారి తీసే అంశం. రానున్న ఎన్ని కల్లో బీజేపీ తో పోటీ చెయ్యను అనీ టీడీపీ సంగతి ఇంకా తేలలేదు అనీ సొంతగా పోటీ చెయ్యడమే మంచిది అని తన ఫీలింగ్ అంటున్నాడు కళ్యాణ్.


టీడీపీ తో పొత్తు పెట్టుకోము అని పైకి చెబుతున్నా చంద్రబాబు మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుగానే పవన్ ఎప్పుడూ కనిపిస్తున్నాడు. వచ్చే ఎన్నికల టైం కి ఖచ్చితంగా టీడీపీ కి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి పవన్ కి వచ్చేలానే ఉంది. నంద్యాల ఉప ఎన్నికలో తటస్థంగా ఉన్నా కూడా అది టీడీపీ కే మేలు జరిగింది. సో టీడీపీ గొప్పతనం, ఎంత స్ట్రాంగ్ గా ఉంది అని పవన్ ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన తరుణం ఇది. 

మరింత సమాచారం తెలుసుకోండి: