గత కొన్ని రోజుల నుంచి ప్రపంచాన్ని విసృతపరిచే విధంగా క్షిపణి ప్రమోగాలు చేస్తూ అటు అమెరికా, జపాన్ లను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న  ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ తాజాగా మరోసారి అమెరికాను టార్గెట్ చేస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.  గత కొంత కాలంగా అమెరికా తమపై సైనిక చర్యలు తీసుకుంటామని ప్రేలాపన చేస్తుందని..అందుకే తాము కూడా ఏమీ తక్కువ కాదనే ఉద్దేశ్యంతో క్షపణి ప్రయోగాలు చేస్తున్నామని అన్నారు.  అమెరికాతో సమానంగా తమ సైనిక సామర్థ్యం ఉండాలనేదే తమ లక్ష్యమని ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ తెలిపారు.
Image result for kim jong trump
సైనిక సామర్థ్యం సమానంగా ఉంటేనే... అమెరికాను నిలువరించగలుగుతామని స్పష్టం చేశారు.  క్షిపణి ప్రయోగా ల విషయంలో   ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా మరోసారి జపాన్ భూభాగం మీదుగా అణు క్షిపణిని ప్రయోగించిన సంగతి తెలిసిందే.  ఈ ప్రయోగం విజయం వంతం కావడంతో అక్కడి మీడియా సమావేశంలో కిమ్ జాంగ్ మాట్లాడుతూ..గత కొంత కాలంగా అమెరికా, ఉత్తర కొరియా అంతు చూస్తాం అని బెదిరిస్తుందని  అన్నారు.
Image result for kim jong trump
నేపథ్యంలో, అమెరికాను దీటుగా ఎదుర్కొనేందుకే, తమ సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంటున్నామని చెప్పారు. అంతే కాదు తమపై యుద్దం చేయాలంటేనే భయపడే విధంగా తాము వ్యూహాలు ఏర్పాటు చేసుకుంటున్నామని..తమపై సైనిక చర్య తీసుకుంటామని అనే ధైర్యం కూడా అమెరికా నేతలకు లేకుండా చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: