రాహుల్ గాంధీ చేతికి పూర్తిగా పగ్గాలు అప్పగించే బాధ్యత ని త్వరలో కాంగ్రెస్ చేపట్టబోతోంది అని టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే సీనియర్ లు అందరినీ మాక్సిమం కట్ చేసి పడేస్తాడు రాహుల్ గాంధీ. పార్టీ లో అహ్మద్ పటేల్ లాంటి వారికే కాస్త ప్రభావం, ప్రాముఖ్యత తగ్గాయి. ఇక రాహుల్ గనక రంగంలోకి దిగితే దిగ్విజయ్ సింగ్ బాధ్యతలకి ఇప్పటికంటే ఎక్కువ కోత పడుతుంది.


దీంతోపాటు బీహార్‌, క‌ర్ణాట‌క‌, పంజాబ్, రాజ‌స్థాన్‌, ఉత్తరాఖండ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ వంటి రాష్ట్రాల‌కు పార్టీ ఇన్ ఛార్జ్ ల నియామ‌కాలు కూడా రాహుల్ అభీష్టానుసారంగానే జ‌రిగిన‌ట్టు చెబుతున్నారు. ఇంకా కొంతమంది సీనియర్లని పక్కన పెట్టె ఆలోచనలో రాహుల్ ఉన్నారు  అని తెలుస్తోంది. అయితే కథలో ట్విస్ట్ ఏంటంటే రాహుల్ కి మెయిన్ పగ్గాలు ఇవ్వాలి అని మొదట నుంచీ బలమైన వాదన వినిపిస్తోంది సీనియర్ లే.


సోనియా మీద అనేక సందర్భాల్లో సీరియస్ గా ఒత్తిడి తీసుకుని వచ్చారు ఆయన. యువనాయకత్వం యొక్క ప్రాదాన్యాత చెప్పి 2014 నుంచీ సోనియా దగ్గర మాట్లాడుతున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు వారి సీట్ల కిందనే రాహుల్ బాంబులు పెట్టె ఆలోచన చెయ్యడంతో వారు ఒక్కసారిగా భయపడుతున్నారు.


నిజానికి, భాజ‌పా కూడా ఈ మ‌ధ్య వ‌రుస‌గా సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టేసింది. ఎల్‌.కె. అద్వానీ, వెంక‌య్య నాయుడు, ఇత‌ర ప్ర‌ముఖ భాజ‌పా సీనియ‌ర్ నేత‌ల్ని ద‌శ‌ల‌వారీగా ప‌క్క‌న పెట్టేశారు ప్ర‌ధాని మోడీ, అమిత్ షా ద్వ‌యం. అలాంటి ప్ర‌క్రియ ఒక‌టి జ‌రుగుతున్న‌ట్టు అనుమానాలు కూడా రానివ్వ‌లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: