ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మీద బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విరుచుకు పడ్డారు. ఝార్ఝాండ్ లో నిర్వహించిన గరీబ్ కల్యాణ మేళా లో మాట్లాడిన ఆయన రాహుల్ ని లక్ష్యంగా చేసుకున్నారు.


రాహుల్ బాబా బాగా మాట్లాడుతున్నారు అనీ కానీ ఆయనకి లాజిక్ లు తెలీవు అనీ సరైన లెక్కలు ఉంటేనే అందరి బండారం బయటపడుతుంది అనేది ఆయన గుర్తు పెట్టుకోవాలి అని అన్నారు అమిత్ షా.  ‘‘రాహుల్ బాబా అమెరికాలో చాలా మాట్లాడుతున్నారు. అయితే ముందు ఆయన కొన్ని లెక్కలు బయటకు తీయాలి.


దేశాన్ని 50 ఏళ్లపాటు పాలించిన నెహ్రూ-గాంధీ రాజకీయ కుటుంబానికి చెందిన నాలుగు తరాల లెక్కలు బయటపెట్టాలి’’ అని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రఘువర్ దాస్ మీద ప్రశంసలు కురిపించారు అమిత్ షా.


రాష్ట్రాన్ని పూర్తి అవినీతి రహిత రాష్ట్రంగా చెయ్యడం లో దాస్ ప్రతిభ కనిపిస్తోంది అన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లోను అభివృద్ధి చెందుతోందన్నారు. అభివృద్ధిలో గుజరాత్ తర్వాతి స్థానంలో జార్ఖండే ఉందని, 8.6 శాతం అభివృద్ధి రేటుతో రెండోస్థానంలో నిలిచిందని వివరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: