మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏం మాట్లాడినా ప్రజలు ఆసక్తిగా చూస్తుంటారు. ఎందుకంటే ఆయన చాలా లాజికల్ గా మాట్లాడతారు. ఆయన చెప్పినది విన్న తర్వాత నిజమే కదా.. అనిపిస్తుంటుంది. ఇప్పుడాయన ఏ పార్టీలో లేకపోయినా పలు సమస్యలపై అడపాదడపా మీడియా ముందుకొస్తున్నారు.

Image result for undavalli aruna kumar

          పోలవరం ప్రాజెక్టుపై ఉండవల్లి హాట్ కామెంట్స్ చేశారు. పోలవరం కాంట్రాక్టర్ సరిగా పనిచేయడం లేదని, ఆ కాంట్రాక్టర్ ను మార్చితేకానీ అది ముందుకెళ్లదని చాలా సార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఉండవల్లి అన్నారు. తాను ఎంతో కాలంగా చెప్తున్నా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం తాజాగా 60సి కింద కాంట్రాక్టర్ కు నోటీసు ఇచ్చిందన్నారు. వెంటనే సత్తా ఉన్న కాంట్రాక్టర్ కు పనులు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.

Image result for undavalli aruna kumar on chandrababu

          2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే మళ్లీ చంద్రబాబే సీఎం అవుతారని ఉండవల్లి జోస్యం చెప్పారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు పోలవరంపై దృష్టి పెట్టి ఉంటే ఇప్పటికే అది పూర్తయి ఉండేదన్నారు. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు బాధ్యత కేంద్రానిదేనన్న ఉండవల్లి.. దానికోసం రాష్ట్ర నిధులు కేటాయించి రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Image result for undavalli aruna kumar

          నంద్యాల ఉపఎన్నికపై ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉపఎన్నికలకు ముందు నంద్యాల డ్వాక్రా సంఘాలకు 4వేల వంతున ప్రభుత్వం జమ చేసిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా చేయని విధంగా కోడ్ అమల్లో ఉండగా ఒక్క నంద్యాలలోనే జమ చేయవచ్చా.. అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతలకు ప్రజల్లో మద్దతు ఉందని అనుకుంటున్నారని.. అయితే వారిది ఒట్టి భ్రమేనని ఉండవల్లి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: