ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఆ కుటుంబా ఒక్కసారే దుఖఃసాగరంలో మునిగిపోయింది.  క్షణికావేశమో..జీవితంపై విరక్తి కలగడమో..కానీ ఒకేసారి ఆరుగురు కుటుంబ సభ్యులు బలవన్మరణానికి పాల్పడటంతో సూర్యాపేటలోని కస్తూరి బజార్ లో విషాదం చోటు చేసుకుంది. బీఎస్ఎన్ఎ‌ల్ ఉద్యోగిగా పనిచేస్తున్న కస్తూరి జనార్ధన్ కు ఇద్దరు కుమారులున్నారు.  పెద్ద కుమారుడు సురేష్ గత కొంత కాలంగా కంప్యూటర్స్ బిజినెస్ చేస్తున్నారు.  

ఈ బిజినెస్ విషయంలో పలువురి వద్ద భారీ స్థాయిలో అప్పులు చేయడం..బిజినెస్ లో తీవ్ర నష్టం రావడంతో ఏం చేయాలో పాలుపోక తీవ్ర మనస్థాపాని గురయ్యాడు. సొసైటీలో ఎంతో గౌరవంగా బతికిన సురేష్ కి అప్పులు ఎక్కువయ్యాయి..అప్పులిచ్చినవారు ఒత్తిడి  పెరిగింది.  దీంతో మానసిక ఒత్తిడికి లోనై అప్పుల వారికి సమాధానం చెప్పలేక వారం రోజుల క్రితం అదృశ్యమయ్యాడు.  

ఓ వైపు కొడుకు అదృశ్యం మరో వైపు అప్పుల వాళ్లు ఇంటికి వచ్చి పరువు తీయడంతో మనస్థాపానికి గురైన జనార్థన్ దంపతులు, రెండవ కొడుకు అశోక్, సురేష్ భార్య, ఇద్దరు పిల్లలు పురుగుల మంది కూల్ డ్రింక్ లో కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.  ప్పులు బాధలే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: