భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మీద అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ప్రశంసలు కురిపించడం ఇప్పుడు ఇంటర్నెట్ లో పెద్ద విశేషంగా మారింది. ట్రంప్ కి ఇవాంక కూతురు మాత్రమే కాదు ప్రత్యెక సలహాదారు కూడా.

సుష్మా స్వరాజ్ - ఇవాంకా ఇద్దరూ న్యూయార్క్ లో రీసెంట్ గా కలిసారు . ఐక్యరాజ సమితి సమావేశానికి వీరిద్దరూ కలిసి హాజరు అయ్యారు. వీరిరువురూ వుమెన్స్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ తో పాటు ఇరు దేశాల్లో పారిశ్రామిక అభివృద్ధిపై చర్చించారు.

భేటీ ముగిసిన వెంటనే ట్విట్టర్ లో కనపడిన ఇవాంక ఇండియా కి చెందిన విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ ని కలవడం తనకి చాలా గర్వంగా ఉంది అని చెప్పుకొచ్చారు. వుమెన్స్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్, త్వరలో జరగనున్న జీఈఎస్2017, అమెరికా, భారత్ లలో వర్క్ ఫోర్స్ డెవలప్ మెంట్ గురించి తమ మధ్య గొప్ప చర్చ జరిగిందని ఆమె తెలిపారు.

"I have long respected India's accomplished and charismatic Foreign Minister @SushmaSwaraj, and it was an honor to meet her today.We had a great discussion on women's entrepreneurship, the upcoming #GES2017 and workforce development in the US and India." అని తన ట్విట్టర్ లో పేర్కొన్నారు ఇవాంక.


మరింత సమాచారం తెలుసుకోండి: