సీనియర్ జర్నలిస్టు , హేతువాది అయిన గౌరీ లంకేష్ మర్డర్ కేసు ఇప్పుడు కర్ణాటక - బీహార్ ప్రభుత్వాల మధ్యన చిచ్చు రేపుతోంది. ఈ కేసు తర్వాత ఇప్పటి వరకూ సరైన పురోగతి చూపించని కర్నాటక సర్కారు మీద అందరూ విమర్శలు కురిపిస్తూ ఉంటే అదే బాట లో బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా కర్ణాటక ప్రభుత్వాన్ని తప్పు బట్టారు.

" ఇంతవరకూ ఎంతమందిని అరస్ట్ చేసారు అనేది కూడా తెలీయడం లేదు. నేను సూటిగా అడుగుతున్నాను. అంత పెద్ద జర్నలిస్ట్ మర్డర్ అయితే మీరు ఇప్పటి వరకూ ఎంతమందిని అరస్ట్ చేసారు " అంటూ నితీష్ కర్ణాటక ప్రభుత్వానికి ప్రశ్న సంధించారు .

ఈ కేసు విచారణ చాలా స్లో గా జరుగుతోంది అనీ మినిమం పురోగతి కూడా లేకుండా కేసుని పక్కదారి పట్టించే వ్యక్తులు ఉన్నట్టు తమదగ్గర గట్టి సమాధానం ఉంది అన్నారు నితీష్ కుమార్.

" ఇలాంటి సంఘటన మా బీహార్ లో జరిగి ఉంటె ఈ పాటికి నేషనల్ మీడియా మొత్తం రచ్చ రచ్చ చేసేది. సౌత్ ప్రాంతం కావడం తో ఒక్కరు కూడా అసలు నోరు విప్పడం లేదు. కర్ణాటక ప్రభుత్వం ని ఒక్క మీడియా మనిషి కూడా ఈ కేసు సంగతి ఏం చేసారు అని ప్రశ్నించడం నేను ఈ మధ్యన చూడలేదు. " అని మీడియా మీద కూడా ఫైర్ అయ్యారు నితీష్. 


మరింత సమాచారం తెలుసుకోండి: