అనంత‌పురం జిల్లా హిందూపురం అసెంబ్లీ, పార్ల‌మెంటు స్థానాలు టీడీపీకి కంచుకోటలు. 1983లో టీడీపీ ఆవిర్భ‌వించిన‌ప్ప‌టి నుంచి ఇక్క‌డ టీడీపీ ప‌ట్టు కంటిన్యూ చేస్తోంది. హిందూపురం ఎంపీ సీటును చాలా త‌క్కువ మెజార్టీతో కోల్పోయినా అసెంబ్లీ సీటును మాత్రం టీడీపీ అన్నిసార్లు గెలుచుకుంది. ఇక హిందూపురం అసెంబ్లీ సీటు నుంచి గెలిచిన టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా కూడా ఉన్నారు. మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్టీఆర్‌తో పాటు ఆయ‌న ఇద్ద‌రు త‌న‌యులు నంద‌మూరి హ‌రికృష్ణ‌, నంద‌మూరి బాల‌కృష్ణ కూడా అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు.

nandamuri balakrishna tdp కోసం చిత్ర ఫలితం

ప్ర‌స్తుతం హిందూపురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బాల‌కృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక హిందూపురం పార్ల‌మెంటు స్థానానికి టీడీపీ నేత నిమ్మ‌ల కిష్ట‌ప్ప ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఏపీలో 2019 ఎన్నిక‌ల హీట్ అప్పుడే స్టార్ట్ అయిపోతుంది. ప్ర‌స్తుతం వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఎవ‌రికి కేటాయిస్తారు ? అన్నదానిపై టీడీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం అక్క‌డ నుంచి అసెంబ్లీకి ప్రాథినిత్యం వ‌హిస్తోన్న బాల‌య్య‌పై వ్య‌తిరేక‌త ఉంది. అయితే ఈ సీటును వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాల‌య్య‌కు ఇస్తారా ?  లేదా తొలిసారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న లోకేష్‌కు కేటాయిస్తారా ? అన్న‌దానిపై చ‌ర్చ న‌డుస్తోంది. 

daggubati purandeswari కోసం చిత్ర ఫలితం

లోకేష్ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల కోసం హిందూపురంతో పాటు కృష్ణా జిల్లా పెన‌మ‌లూరు, గుడివాడ స్థానాల పేర్లు కూడా ప‌రిశీల‌న‌లో ఉన్నాయి.అయితే మెజార్టీ ఛాన్సులు మాత్రం మ‌ళ్లీ బాల‌య్య ఇక్క‌డ నుంచే పోటీ చేసే ఛాన్సులు ఉన్నాయి. ఇక హిందూపురం ఎంపీ సీటు నుంచి టీడీపీ త‌ర‌పున ప్రాథినిత్యం వ‌హిస్తోన్న నిమ్మ‌ల కిష్ట‌ప్ప సీటును కూడా మారుస్తార‌న్న ప్ర‌చారం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. నిమ్మ‌ల కిష్ట‌ప్ప‌.. త‌న త‌న‌యుడిని రాజ‌కీయాల్లోకి తీసుకురావాల‌ని భావిస్తున్నారు. 


త‌న వార‌సుడి కోసం ఆయ‌న పుట్ట‌ప‌ర్తి లేదా పెనుగొండ అసెంబ్లీ స్థానాల‌పై ప‌ట్టుకు ట్రై చేస్తున్నారు. అలా జ‌ర‌గ‌ని ప‌క్షంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవ్వాల‌ని ఆశ‌ప‌డుతోన్న ఆయ‌న  హిందూపురం ఎంపీగా కాకుండా పెనుగొండ లేదా పుట్ట‌ప‌ర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌నుకుంటున్నారు. ఇదే టైంలో టీడీపీ నుంచి హిందూపురం ఎంపీ సీటును టీడీపీలో మ‌రో బిగ్ షాట్ అడుగుతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే బీజేపీకి చెందిన కేంద్ర‌మాజీ మంత్రి ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి సైతం ఈ సారి పొత్తులో భాగంగా హిందూపురం ఎంపీ సీటు నుంచి పోటీ చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో హిందూపురం ఎంపీ, ఎమ్మెల్యే రెండు సీట్ల‌కు సంబంధించి అధికార టీడీపీ, ఆ పార్టీ మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీల‌లో ఎవ‌రు పోటీ చేస్తార‌న్న‌దానిపై ఇప్పుడే హాట్ టాపిక్ న‌డుస్తోంది. 


 nimmala kristappa కోసం చిత్ర ఫలితం


మరింత సమాచారం తెలుసుకోండి: