2019 ఎలక్షన్ బరిలో టీడీపీ, వైకాపా తో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన పార్టీ మీద కూడా అందరి కళ్ళూ ఉంటాయి. గత ఎన్నికల టైం కి పార్టీ పెట్టి పోటీ కూడా చెయ్యకుండా బీజేపీ - టీడీపీ కూటమికి సపోర్ట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ . అయితే బీజేపీ తో పొరపొచ్చులు వచ్చి ఈ మధ్య కాలం లో సరిగ్గా ఉండడం లేదు పవన్.


ప్రత్యెక హోదా విషయం లో మోసం చేసారు అంటూ బీజేపీ ని దాదాపుగా బాయ్ కాట్ చేసాడు. అయితే 2019 ఎలక్షన్ నాటికి టీడీపీ తో , బీజేపీ తో పొత్తు పెట్టుకోవడం తప్ప సొంతగా గెలిచే సత్తా జనసేన కి లేదు అది పవన్ కి కూడా తెలిసిన విషయమే. ఈ నేప‌థ్యంలో భాజ‌పా కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్ట‌త కోసం ఎదురుచూస్తున్న‌ట్టు ఓ క‌థ‌నం ప్ర‌చారంలోకి వ‌స్తోంది.


ప‌వ‌న్ విష‌యంలో కొన్నాళ్ల‌పాటు వేచి చూస్తే బెట‌ర్ అనీ, అంత‌వ‌ర‌కూ అంటీ ముట్ట‌న‌ట్టుగా ఉండాల‌నే ఉద్దేశంతో భాజ‌పా ఉన్న‌ట్టు, ఒక తాజా ఉదంతాన్ని దీనికి ఉదాహ‌ర‌ణ‌గా చెబుతున్నారు. వాళ్ళూ వీళ్ళూ కాదు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ విషయం లో స్పష్టత కోసం చూస్తున్నారట.


ఏపీ లో ఒంటరిగా గెలిచే సీన్ బీజేపీ కి ఎటూ లేదు సో పవన్ లాంటి ఒక స్టార్ వ్యక్తి తమతో ఉండాలి ఆనేది అమిత్ షా, మోడీ ల ప్లాన్ కనీ ప్రత్యేక హోదా విషయం లో బీజేపీ ఫెయిల్ అవ్వడం తో పవన్ ఒళ్ళు మండి వారితో పేచీ పెట్టుకున్నాడు. ఇక ఈ కథ ఏ మలుపు తిరిగి పవన్ ఏ నిర్ణయం తీసుకుంటాడా అని మోడీ సైతం తన వారితో డిస్కస్ చేస్తున్నట్టు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: