నంద్యాల - కాకినాడ ఎలక్షన్ లో తమదైన శైలి లో ప్రభావం చూపించాలి అనుకున్న జగన్ మోహన్ రెడ్డి అతని పార్టీ క్యాడర్ తీవ్రంగా దెబ్బ తిన్నారు. జగన్ మోహన్ రెడ్డి బ్రాండ్ ఇమేజ్ కూడా చెల్లదు అన్నట్టు ఆయన ప్రచారం చేసినా కూడా నంద్యాల లో టీడీపీ కి బంపర్ మెజారిటీ వచ్చేసింది .


ఇక ఈ ఓటముల గురించి రీసెంట్ గా జగన్ - పీకే స్వయంగా పర్సనల్ గా కలుసుకుని చాలా గంటలు మాట్లాడుకున్నారు అని మన వెబ్సైటు కి ఉన్న విశ్వసనీయ సమాచారం. జరిగిన దాని గురించి పక్కన పెట్టి ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ఎలా అంటూ జగన్ పీకే ని ప్రశ్నించగా ఆయన కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది.


హైదరాబాద్ నుంచే పార్టీ కార్యకలాపాలను కొనసాగిస్తే, పార్టీపై పార్ట్ టైమ్ అనే ముద్ర పడే అవకాశం ఉందని ఈ సందర్బంగా జగన్ కు పీకే చెప్పారు. ఈ నేపథ్యంలో, విజయవాడలో తాత్కాలిక కార్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేసేలా పార్టీ నేతలకు జగన్ ఆదేశించారు.


ప్రస్తుతం హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఉన్న ఆఫీసు ని వీలైనంత ఫాస్ట్ గా విజయవాడ లో పెట్టాలి అనీ తాత్కాలిక నిర్మాణం అయినా పరవాలేదు అని జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. విజయవాడ బందరు రోడ్డు లోని స్వగృహ ఫుడ్స్ పక్కన తన పార్టీ నేథలకి ఒక స్థలం లో పనులు మొదలు పెట్టబోతున్నారు. 27 ఆ ప్రాంతం లో విజయవాడ రాబోతున్నారు జగన్. 


మరింత సమాచారం తెలుసుకోండి: