తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం కాళేశ్వరం ప్రాజెక్టు.  ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామం దగ్గర నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని 10 వ ప్యాకేజీ పంపు హౌజ్ డ్రాఫ్ట్ ట్యూబ్ పైకప్పు కూలిన ఘటన లో ఆరుగురు కూలీలు దుర్మరణం చెందగా, నలుగురు గాయపడ్డారు.  ఈ ప్రాజెక్ట్ వర్క్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ దుర్ఘటన జరగడం పట్ల పలువురు తీవ్ర  దిగ్భ్రాంతి కి గురయ్యారు.  ప్రాణహిత-చేవెళ్ళ 10 వ ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న టనెల్ పనుల వద్ద ఎయిర్ బ్లాస్టింగ్ జరగడంవల్ల ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఘోరప్రమాదం
సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. మృతులు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు.కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో 10వ ప్యాకేజీ పంపు హౌజ్‌ డ్రాఫ్ట్‌ ట్యూబ్‌ పైకప్పు కూలి ప్రాణనష్టం జరగడం పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అంతేకాదు ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  ఘటన పై మంత్రి హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాడ సానుభూతి తెలిపారు. ప్రమాదం సమాచారం అందిన వెంటనే మంత్రి హరీశ్ రావు జలసౌధ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు.
కాళేశ్వరం ప్రమాదంపై విచారణకు ఆదేశం
ఈ ఘటనలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయాన్ని కాంట్రాక్టు ఏజన్సీ ప్రకటించినట్టు మంత్రి హరీశ్ రావు తెలియజేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: