టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘జైలవకుశ’ సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు ఎక్కువ శాతం పాజిటివ్ రిపోర్ట్సే వచ్చాయి. ఏ సినిమా అయినా అందరికీ నచ్చాలని లేదు. ఎంత గొప్పగా తీసిన సినిమాను అయినా విమర్శించే వాళ్ళు ఉంటారు. ఆ సినిమా న‌చ్చ‌ని వాళ్లు ఉంటారు. అయితే జై ల‌వ‌కుశలోను కొన్ని లోపాలు ఉన్నా ఎన్టీఆర్ న‌ట‌న సినిమాను పీక్ రేంజ్‌కు తీసుకెళ్లిపోయింది. 

‘జైలవకుశ’పై టీడీపీ శ్రేణుల దుష్ప్రచారం

ఇక ఈ సినిమాకు మార్నింగ్ షోలు కంప్లీట్ అయినప్ప‌టి నుంచే సినిమాకు ఎక్కువుగా పాజిటివ్ రిపోర్ట్స్ వ‌స్తున్నా టీడీపీ శ్రేణుల నుంచి నెగిటివ్ టాక్ రావ‌డం స్టార్ట్ అయ్యింది. ద‌మ్ము సినిమా నుంచి ఎన్టీఆర్ సినిమాల‌కు ఇలాగే జ‌రుగుతోంది. ఈ హీరోకు చెందిన పలు సినిమాలు బాగున్నా కూడా నెగిటివ్ ప్రచారం వల్ల దెబ్బతిన్నాయి. తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏవైతే  బాహుబలి సెట్టింగ్ లు చూసి ఏరికోరి అమరావతి డిజైన్ల విషయంలో సలహాలు, సూచనల కోసం పిలిచి మూడుసార్లు మాట్లాడిన రాజమౌళే జైలవకుశ సినిమా చూసి తారక్ న‌ట‌న‌పై అద్భుత‌మైన ప్ర‌శంస‌లు కురిపించాడు.


అయితే ఇప్పుడు జై ల‌వ‌కుశ‌పై నెగిటివ్ టాక్ ప్ర‌చారం వెన‌క అమ‌రావ‌తి కేంద్రంగా ఎంపిక చేసిన కొన్ని టీడీపీ శ్రేణులు ఈ సినిమాపై వాట్సాప్ గ్రూపుల్లో నెగిటివ్ టాక్ ప్ర‌చారం చేస్తున్నార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. షాక్ ఏంటంటే అమ‌రావ‌తిలో టీడీపీ బీట్ చేసే సీనియ‌ర్ పాత్రికేయుల‌కు కూడా ఈ మెసేజ్‌లు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. సోష‌ల్ మీడియాలో జై ల‌వ‌కుశ సినిమాపై స‌ర్య్కులేట్ అవుతోన్న మెసేజ్ ఇలా ఉంది. ‘బాక్సాఫీస్ ముందు బోల్తాకొట్టిన జై లవకుశ. కథలో కొత్తదనం లేకపోవటం..కథనాన్ని రక్తి కట్టించలేకపోవటం పెద్దలోపాలుగా ఫీల్ అవుతున్న ప్రేక్షకులు. జై లవకుశ కన్నా పైసా వసూల్‌ బెటర్ అంటున్న ప్రేక్షకులు’. ఇదీ భారీగా సర్కులేట్ అవుతున్న వాట్సప్ మెసేజ్. 


గ‌తంలో కూడా ఎన్టీఆర్ నాన్న‌కు ప్రేమ‌తో, బాల‌య్య డిక్టేట‌ర్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయిన‌ప్పుడు నాన్న‌కు ప్రేమ‌తో సినిమాకు థియేట‌ర్లు లేకుండా ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచే ఒత్తిడి వ‌చ్చిన‌ట్టు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. వీళ్ల మెసేజ్ ఎలా ఉన్నా పైసా వ‌సూల్‌తో కంపేరిజ‌న్ చేయ‌డం దారుణం. పైసా వ‌సూల్ లాంగ్ ర‌న్‌లో కేవ‌ల రూ.18 కోట్ల షేర్ రాబ‌ట్టింది. జై ల‌వ‌కుశ తొలి రోజే రూ.50 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు దాటేసిందంటున్నారు. ఇక ఈ ప్ర‌చారం ఎలా ఉన్నా అంతిమంగా సినిమా ఫలితాన్ని నిర్ణయించేది ప్రేక్షకులే. ఇక సినిమా అంచ‌నాల‌కు కాస్త తగ్గినా భారీ వ‌సూళ్లే సాధించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: