గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సంచలనాలకు కేంద్రంగా మారిన కంచె ఐలయ్య రాసిన కోమట్లు- సామాజిక స్మగ్లర్లు పుస్తకం పై రోజు రోజుకీ వివాదాలు ముదిరిపోతున్నాయి.  తాజాగా కోమట్లు- సామాజిక స్మగ్లర్లు పుస్తకం పై మొదటి నుంచి కోపంతో ఊగి పోతున్న ఒక సామాజిక వర్గం ఇప్పుడు మరింత కార్నర్ చేసిందని తెలుస్తుంది.  ఇప్పటికే వైశ్య కమ్యూనిటీ నేతలు ఆయన్ను నేరుగా టార్గెట్ చేయడంతో విషయం మరింత ముదిరింది.

తెలుగు రాష్ట్రాల్లో తమ మనోభావాలను కించ పరిచే విధంగా ఆయన ప్రవర్తన ఉందని వైశ్యు సంఘలు తీవ్ర ఆందోళన చేస్తున్నాయి.  ఇక కంచె ఐలయ్యను నేరుగా టార్గెట్ చేస్తూ..కొందరు వైశ్యులు మరికొంచెం మొందుకెళ్ళి.. కంచ ఐలయ్య పాద పట్టల్ని తయారుచేసి అమ్మడం మొదలుపెట్టారు.  గుళ్లూ, గోపురాలు, కళ్యాన మండపాల వద్ద ఐలయ్య ఫోటో ముద్రించిన డోర్ మాట్స్ అమ్ముతున్నారు.  

దీనిపై కొంద మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  ఏది ఏమైనా రెండు సామాజిక వర్గాల్లోనూ ఆందోళన మొదలైంది. కాగా,  తాను రాసిన పుస్తకం పై ఏమాత్రం తగ్గడం లేదు కంచె ఐలయ్య.  ఇప్పటికే పలు టివి చానెల్స్ లో కొంత మంది గిట్టని వారు..రాజకీయ నేతలు ఈ అంశాన్ని పెద్దగా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: