తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎన్నికయ్యారు.  ఆనాటి నుంచి తెలంగాణ అభివృద్ది కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు కేసీఆర్.  మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూమ్ పథకాలతో ప్రజలకు మరింత చేరు అయ్యారు.  హైదరాబాద్ ని విశ్వనగరంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నారు. జిల్లాల వారిగా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అన్ని జిల్లా అభివృద్ది పనులు పర్యవేక్షిస్తున్నారు.
Image result for డీఏ పెంపు
 ఇక తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం..దసరా కానుక ఇచ్చింది.  ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దసరా కానుక.. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
22.008 శాతం నుంచి 24.104 శాతానికి డీఏను పెంచింది. పెంచిన డీఏ 2017 జనవరి 1 నుంచి వర్తించనుంది. సెప్టెంబర్ నెల వేతనంతో పెరిగిన కరువు భత్యం ఇవ్వనున్నారు. మిగతా నెలల డీఏ జీపీఎఫ్ ఖాతాలో ప్రభుత్వం కలపనుంది. డీఏ పెంచడంతో ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: