బ్రిటన్ అమెరికాలలో ప్రజాస్వామ్య విలసిల్లుతుంది. అంతకంటే ప్రశస్థమైన సర్వసత్తాక లౌకిక భావనతో, స్వతంత్రానంతరం ప్రపంచంలోనే అత్యధిక ప్రజలతో  భారత్  "ప్రజాస్వామ్యరాజ్యంగా - సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం" గా తనను తాను ఎన్నో ఆశలతో నిర్వచించుకుంది. 


భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతి పెద్ద లిఖిత రాజ్యాంగాలలో ఒకటి. రాజ్యాంగం భారత ప్రభుత్వ వ్యవస్థ, రాష్ట్రాలు, రాష్ట్రాల నిర్మాణం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్ర రాష్ట్రాల విధులు, అధికారాలు, స్థానిక సంస్థలు, ఎన్నికలు మొదలైన విషయాలను నిర్వచించింది. పౌరులకు, భారత రాజకీయ వ్యవస్థకు సంబంధించి కింది వాటిని సూత్రీకరించింది:


ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ
బలమైన కేంద్రంతో కూడిన సమాఖ్య వ్యవస్థ
ప్రాథమిక విధులు
ప్రాథమిక హక్కులు
ఆదేశ సూత్రాలు
ద్విసభా విధానం
వివిధ భాషలు
వెనుకబడిన సామాజిక వర్గాలు
అవసరమైనపుడు రాజ్యాంగాన్ని సవరించుకోడానికి వెసులుబాటు కలిగిస్తూ, సవరణ విధానాన్ని కూడా నిర్దేశించింది. 



దీన్ని బట్టి అటు రాజ్యాంగం లోగాని, దాన్ని అనుసరించాల్సిన ప్రజల్లో కాని ఏ తప్పూలేదు. తప్పంతా ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాలను నడిపించలేని ప్రభుత్వాలదే అను రూఢీ ఔతుంది.  


mamata benerji high court judgement on Durga nimajjanam & mohram కోసం చిత్ర ఫలితం


అయితే ఏదేశమైనా సుభిక్షంగా ఉందని చెప్పాలంటే, ఆ దేశంలో అధిక సంఖ్యాకులు (అందరూ అన్నీ మతాలు కులాలు) ప్రయోజనం పొందుతున్నారనే అర్ధం. కాని భారత్ లో మెజారిటీ ప్రజలైన హిందువులు చాలా దయనీయ పరిస్థితుల్లో ఇబ్బందులకు గురతున్నారు. మైనారిటీ వారికి ప్రయోజనాలు చేకూర్చే ప్రభుత్వాలతో మెజారిటీ హిందువులు తన సర్వస్వం త్యాగం చేయవలసివస్తుంది. గత 70 సంవత్సరాల స్వాతంత్రం మనకు సాధించినది ఏమంటే మైనారిటీ ఓట్లతో గెలుస్తున్న ప్రభుత్వాలు రాజ్యాంగం మరచి దౌర్జన్య నిరంకుశ పాలనలను కొనసాగించటాన్ని ప్రజలు సహించటమే. లేకుంటే ఇతర దేశాల ప్రజాస్వామ్య ప్రభుత్వాల మాదిరిగా మనమూ చక్కని పాలనను అనుభవించేవాళ్ళమే.  మమత బెనర్జి మతాలకోసం నటించినంత గొప్పగా మతసామరస్యంలో కనిపించదు


mamata benerji high court judgement on Durga nimajjanam & mohram కోసం చిత్ర ఫలితం


ఇక్కడ మెజారిటీ ప్రజలు అందరూ సర్వసమానత్వం అనుభవిస్తున్నారా? అనేదానికి సమాధానం లేదు అని,  పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యవహారాలు పరిశీలిస్తే అర్ధమౌతుంది. హిందువులు తమ మతాచారాలకు, మైనారిటీల మత అవసరాలు అడ్దు రాకుండా కూడా చూసుకోలేని పరిస్థితుల్లో  ధౌర్భాగ్య పరిషితుల్లో ఉంది.  ఉన్నత న్యాయస్థానం కలగ చేసుకుని మొట్టికాయలేస్తే తప్ప పాలన ఎలా చేయాలో సర్వమత సామరస్యాన్ని ఎలా నిర్వహించాలో అర్ధం కాలేదు.  


అసలు కథ, ఏమంటే శరన్నవరాత్రులు ముగిసిన తర్వాత అప్పటి వరకు పూజించిన దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేయడం కలకత్తాలో ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సారి నిమజ్జనోత్సవం జరిగే రోజు మొహర్రం వచ్చింది. అదే రోజు ముస్లిం సోదరులు కూడా తాజియా ఊరేగింపు జరుపుతారు, ఈ రెండు ఊరేగింపులు ఒకేసారి వస్తే శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయనే భావనతో మమత ప్రభుత్వం దుర్గామాత విగ్రహాలను మొహర్రం రోజున నిమజ్జనం చేయరాదంటూ ఆదేశించింది. అదే అసలు వివాదానికి కేంద్ర బిందువైంది. ప్రభుత్వం చేతకానితనం హైకోర్ట్ సాక్షిగా బయటపడింది.   


ఆ ఆదేశాలను సవాలు చేస్తూ కోల్‌కతా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై ఇవాళ విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనపై చెరగని మరకపడేలా చేసింది. ఆమెకు ధిమ్మతిరగటమే కాదు, భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది. 


దుర్గామాత విగ్రహాల నిమజ్జనంపై మమత ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను కోల్‌కతా హైకోర్టు రద్దు చేసింది. ప్రభుత్వం యిచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ,  



"అధికారం చేతుల్లో ఉంది కాదా! అని నిరంకుశ ఆదేశాలు జారీ చేయవచ్చునా?" అని ప్రశ్నించింది.  మొహర్రం ఊరేగింపుకు, దుర్గామాత విగ్రహాల నిమజ్జనాలకు వేర్వేరు మార్గాలను నిర్ణయించాలని ఆదేశించింది.


ముంబై పోలీసులను చూసి నేర్చుకోవాలని సూచించింది.


భారత ప్రజాస్వామ్య పాలనలో రాజ్యాంగం ప్రకారం అన్నీ మతాలు సర్వ సమానం. ఇక్కడ సమస్య పోలీసులది. శాంతి భద్రత ల విషయం పోలీసులకు వదిలేస్తే, వారే సరిగ్గా వారి విధి నిర్వహణను కొన్సాగిస్తారు. అలాకాకుండా మైనారిటీలకు తామేదో వరాలు కురిపిస్తున్నట్లు, రాజకీయాలను విధినిర్వహణలో జొప్పిస్తేనే, అసలు సమస్యలు పుట్టుకొస్తాయి.  అంత శాంతి భద్రత ల సమస్య వస్తుందని, తాము నిర్వహించలేమని భావిస్తే, అధికారం నిక్షేపంగా వదిలెయ్యటం మంచిది.  అంతే కాని ఒక మతం వారి కోసం మరో మతం వారి సెంటిమెంట్ పై దెబ్బ కొడితే,  తీర్పులు ఇలాగే వస్థాయి. మమతా కయ్యానికి కాలుదువ్వటంమాని తన పని తాను సరిగ్గా రాజ్యాంగబద్ధంగా నిర్వహించటం అవసరం.  



మరింత సమాచారం తెలుసుకోండి: