చేసిన పాపం ఊరికే పోదు అన్నట్లు...సినిమా చాన్స్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకొని నమ్మి వచ్చిన ఓ యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు.  తాను మోసపోయానని తెలిసిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది.  వివరాల్లోకి వెళితే.. 'రా.వన్', 'చెన్నయ్ ఎక్స్ ప్రెస్', 'దిల్ వాలే' వంటి హిందీ చిత్రాలను నిర్మించిన బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీ అంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది.  ఈ క్రేజ్ తో అతని వద్దకు ఎంతో మంది అప్ కమింగ్ హీరోయిన్లు, మోడల్స్ చాన్స్ ల కోసం వెళ్తుంటారు.  

Image result for బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీ

ఈ నేపథ్యంలో  2015లో బీబీఎం విద్యార్థిని కి తన సినిమాలో చాన్స్ ఇప్పిస్తానని ట్రాప్ లో పడేశాడు..ఆ తర్వాత తన పర్సనల్ బెడ్ రూమ్ కి రప్పించి ఆ అమ్మాయికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. అంతే కాదు ఆ సమయంలో అసభ్యకరమైన ఫోటో, వీడియో తీసి ఆ యువతిని బెదిరించి ఆరు నెలలపాటు ముంబై, హైదరాబాదుల్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  దీంతో విసుగు చెందిన ఆ యువతి కరీం మొరానీ తనపై అత్యాచారం చేశాడని..అతనికి అండర్ వరల్డ్ మాఫియాతో కూడా సంబంధాలు ఉన్నాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Image result for బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీ
అనంతరం ఆమెను చంపేస్తానని బెదిరింపులకు కూడా పాల్పడ్డట్టు తెలిపింది.  దీంతో కరీమ్ ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించగా, బెయిల్ పై బయటకు వచ్చి, ఆమెపై బెదిరింపులకు దిగాడు.  బయటకు వచ్చిన కరీమ్ ఆ యువతిని హత్య చేస్తానని మళ్లీ బెదిరించడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు నిందితుడి బెయిల్ ను రద్దు చేసింది, వెంటనే అతను కోర్టులో లొంగిపోవాలని సూచించింది.   అంతే కాదు అ బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీకి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
Image result for బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీ
అతడిని లొంగి పోవాల్సిందిగా ఆరు నెలల క్రితమే కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో తాజాగా కోర్టు  కరీం మొరానీని తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవాల్సిందిగా చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.  దీంతో రాత్రి  హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: