ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు..ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మనిషి ఆయుష్షు ఎంతో పెరుగుతుందని మన పెద్దలు చెబుతుంటారు.  నేటి సమాజంలో ఎక్కడ చూసినా పొల్యూషన్..దీంతో మనిషి జీవితంలో ఆయుష్షు క్రమేనా తగ్గుతూ వస్తుంది.  పూర్వ కాలంలో మహా రుషులు తమ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటూ ఎన్నో సంవత్సరాలు జీవించినట్లు పురాణాల్లో తెలుసుకున్నాం. తాజాగా భారత దేశంలో యోగ గురువుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న రాందేవ్ బాబా మానవునికి 400 ఏళ్లు బతకగలిగే సామర్థ్యం ఉందని అంటున్నారు.  
Image result for ram dev baba 400 years
ఢిల్లీలో జరిగిన 12వ జాతీయ నాణ్యత సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మానవ శరీర నిర్మాణం 400 ఏళ్లు మనుగడ సాగించగలిగే శక్తితో రూపొందిందని అన్నారు.   అలాంటి మన శరీరాన్ని కాపాడుకోవటానికి రోగ్యకరమైన అలవాట్లతో తరచు వ్యాయామం చేస్తే ఎక్కువ కాలం బతికే అవకాశం ఉందని ఆయన అన్నారు.  
Image result for ram dev baba 400 years
ప్రస్తుతం సమంజంలో మనం తీసుకునే ఆహార పదార్థల వల్ల కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని..అనారోగ్యకరమైన అలవాట్లతో రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులతో బాధపడుతూ మందులతో సహవాసం చేస్తున్నామని ఆయన తెలిపారు.  ఆరోగ్యాన్నికాపాడు కోవాలంటే.. అనారోగ్యకరమైన భోజనాన్ని తీసుకోవడం తగ్గించాలని ఆయన సూచించారు.  
Image result for ram dev baba 400 years
అంతే కాదు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కచ్చితమైన డైట్ పాటించడం ద్వారా 38 కేజీల బరువు తగ్గారని ఆయన వెల్లడించారు. ఆయన మధ్యాహ్న భోజన పరిమాణం తగ్గించడంతో పాటు, రాత్రుళ్లు కేవలం ఉడకబెట్టిన కూరగాయలు, సూపు మాత్రమే తీసుకున్నారని, దీంతో ఆయన బరువు తగ్గినట్లు చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: