భారత దేశంలో అత్యంత విషాదకరమైన సంఘటనగా చెప్పుకునేది 1993 ముంబాయి బాంబు పేలుళ్ల.  ఇంతటి దారుణానికి పాల్పపడింది..అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం.  బాంబు పేలుళ్ల అనంతరం పాకిస్థాన్ పారిపోయిన  దావూద్ అక్కడి నుంచి తన నెట్ వర్క్ నడుపుతూ వచ్చాడు.  ఆ  దావూద్ ని భారత్ కి తీసుకు వస్తారని వార్తలు కూడా వచ్చాయి.  
Photo credit: Activist Anjali Damania's Twitter handle
రీసెంట్ గా బిల్డర్లు, నగల వర్తకులను బెదిరించి వారి నుంచి డబ్బులు వసూలు చేసిన దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ తో సంబంధాలున్న ఇద్దరిని అరెస్టు చేశారు థానె పోలీసులు. తాజాగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తనను చంపేస్తానని బెదిరిస్తూ ఫోన్ కాల్ చేశాడని  ప్రముఖ సామాజిక కార్యకర్త అంజలి దమానియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేత ఏక్ నాథ్ ఖడ్సేపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని... లేకపోతే చావు తప్పదని బెదిరించారని ఆమె తన ఫిర్యాదు లో పేర్కొన్నారు.
अंजलि दमानिया को पाकिस्तान से मिली दाऊद की धमकी : खड़से के खिलाफ केस वापस लो, वर्ना जान दो...
దావూద్ ఇబ్రహీం నుంచి తనకు ఈ కాల్స్ వచ్చాయని ఆ ఫోన్ కాల్ పాకిస్థాన్ నుంచి వచ్చిందని... నంబరు దావూద్ ఇబ్రహీం పేరిట ఉందని తెలిపారు.  తన భర్త తో చాటింగ్ చేస్తున్న సమయంలో రాత్రి 12.33 గంటలకు ఈ ఫోన్ వచ్చిందని ఆమె తెలిపారు. ట్రూకాలర్ లో ఆ నంబర్ దావూద్ ఇబ్రహీంకు చెందనదిగా చూపించిందని చెప్పారు. ట్రూకాలర్ స్క్రీన్ షాట్ ను కూడా తీసి ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు.




మరింత సమాచారం తెలుసుకోండి: