సాధారణంగా పెళ్లి వేడుక‌లు నిర్వ‌హించుకోవ‌డంలో ప్ర‌త్యేక‌త‌లు చాటుకోవ‌డానికి ప్రయత్నిస్తుంటారు.  కొంత మంది వివాహాలు అంగరంగ వైభవంగా చేసుకోవడం..విమానంలో, సముద్ర గర్భంలో ఎత్తైన కొండ ప్రాంతంలో ఇలా రక రకాలుగా పెళ్లి చేసుకొని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు. తాజాగా  శ్రీలంక‌కు చెందిన ఓ జంట త‌మ పెళ్లి కోసం 3.2 కిలోమీట‌ర్ల పొడ‌వైన పెళ్లి కూతురు చీర‌ను త‌యారు చేయించుకున్నారు.

ఈ వింతైన పెళ్లి చూసి ఎంతో మంది అబ్బో అని అనుకున్నారు..కానీ తర్వాత అదే చీర తమ కొంప ముంచుతుందని నవవధువులు మాత్రం ఊహించుకోలేక పోయారు.   చీర రోడ్డుకి త‌గ‌ల‌కుండా ఉండేందుకు వారు 250 మంది విద్యార్థుల‌ను ఎంచుకున్నారు.  అయితే విద్యార్థినులు ఆ చీరను పట్టుకుని మండుటెండలో నిల్చోవడం చర్చనీయాంశమైంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు విచారణ చేపట్టారు. దంపతులతో పాటు ఇందుకు కారకులైన కొందరిని  అధికారులు ప్రశ్నించనున్నారు.

పాఠ‌శాల ప‌నిదినాల్లో ఇలాంటి వేడుక‌ల కోసం వారిని ఉప‌యోగించుకోవ‌డం, వారి హ‌క్కుల‌ను కాల‌రాయ‌డమేన‌ని ఆ జంట‌పై కేసు న‌మోదు చేసి, విచార‌ణ ప్రారంభించింది. దీన్ని ఇలాగే వ‌దిలేస్తే ఒక ట్రెండ్‌గా మారే ప్ర‌మాదముంద‌ని, అందుకే వారిపై చ‌ర్య తీసుకుంటామ‌ని జాతీయ బాల‌ల హ‌క్కుల సంర‌క్ష‌ణ విభాగం చైర్మ‌న్ మారిని ది లివేరా తెలిపింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: