భారత విదేశాంగశాఖ మంత్రి  సుష్మ స్వరాజ్ భారత్ కు గర్వకారణం. ఆమె ప్రసంగిస్తే ఒక పట్టాన ఎవరూ ప్రతి స్పందించ లేరు. స్పష్టత అనేది ఆమె ఉపన్యాసాల్లోని ప్రత్యేకత. ఆమె ఈ మధ్య  ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్థాన్‌కి తన విశ్వరూపం చూపించారు. “సరిహద్దుకి ఇవతల దేశంలో పేదరికంని రూపుమాపేందుకు పేదరికంతో పోరాడుతోంటే, సరిహద్దు కు అవతల వున్న పాకిస్థాన్‌ మాత్రం భారత్‌ లో ఎలా విధ్వంసం సృష్టించాలా!”  అని కుట్రలు చేస్తూ, పెను విద్వంసాలు సృష్టిస్తూ  కాలం గడిపేస్తోందని పాకిస్థాన్‌ని ఎకాఎకీ  ఏకిపారేశారు.

sushma swaraj speech in un general assembly కోసం చిత్ర ఫలితం 

విధ్వంసం, మారణహోమం, క్రూరత్వాన్ని ప్రపంచానికి ఎగుమతి చేయడంతో పాకిస్తాన్‌ ముందువరుసలో ఉందని విరుచుకు పడ్డారు. అలాంటి దేశం ఐరాస వేదికపై నుంచి మానవత్వం గురించి మాట్లాడుతూ, కపట ప్రదర్శనలో విజేతగా నిలిచిందని సుష్మా స్వరాజ్‌ ఎద్దేవాచేశారు. ఉగ్రవాదం మానవజాతి అస్తిత్వానికే ప్రమాదకరమని,  ఉగ్రవాదుల జాబితాను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలే ఆమోదించకపోతే, ఉగ్రవాద భూతంపై అంతర్జాతీయ సమాజం ఎలా పోరాటం చేయగలదని 72వ ఐరాస సాధారణ అసెంబ్లీలో శనివారం సుష్మా ప్రసంగిస్తూ ఆమె ప్రశ్నించారు.  

 

భారత్ ఐటీ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న ప్రస్తుత తరుణంలో ఇస్లామాబాద్ మాత్రం ఉగ్రవాద శక్తుల ఉత్పత్తి ప్రణాళికలు రచిస్తూ ఉత్పత్తి చేస్తూ, ప్రత్యేకించి భారత్ కు ఆపై అనేక దేశాలకు నిర్విరామంగా సరపరాచేస్తూ, విశ్వవ్యాప్తంగా ఉగ్రవాద అగ్ని కీలలను రాజేస్తుంది. ఉగ్రవాదానికి కీలక ఉత్పత్తి కేంద్రంగా, ఎక్స్‌-పోర్ట్ కు కీలకంగా ఎదుగుతోందని సుష్మా స్వరాజ్ పాకిస్థాన్ పై నిప్పులు చెరిగారు.

sushma swaraj speech in un general assembly కోసం చిత్ర ఫలితం 

ఐఐటీ, ఐఐఎంలని స్థాపించి యువతని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతోంటే, మరోవైపు పాకిస్థాన్ లష్కర్ ఏ తొయిబా, జైష్-ఎ-మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల ఏర్పాటుకు మద్దతిస్తూ ఉగ్రవాదులను తయారు చేసే కేంద్రంగా మారిందని ఆరోపించి ప్రపంచ దేశాల ముందు పాకిస్థాన్ ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. పాకిస్థాన్ “టెర్రరిస్థాన్‌” గా తయారైందని ఆరోపించారు.

 

భారత్ తమ విద్యా సంస్థల్లో ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులని తయారు చేస్తే, పాకిస్థాన్ మాత్రం ఆ దేశం గడ్డపై ఉగ్రవాదులను తయారు చేసిందని సుష్మా స్వరాజ్ మండిపడ్డారు. భారత్‌లోని విద్యా సంస్థల్లో చదువుకున్న డాక్టర్లు మనుషులకి ప్రాణాలు పోస్తోంటే, పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు అదే మనుషుల ప్రాణాలు తీసేందుకు పనిగట్టుకు తిరుగుతున్నాయి అని ప్రకటించడం ద్వారా సుష్మ పాక్‌పై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.

sushma swaraj speech in un general assembly కోసం చిత్ర ఫలితం 

ప్రపంచానికి సవాలుగా మారిన ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రపంచ దేశాలన్నీ ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరాన్ని బలంగా వ్యక్తీకరించారు. ఉగ్రవాదానికి మద్దతు పలుకుతున్న పాకిస్థాన్ లాంటి దేశాల ఆటకట్టించి వారికి బుద్ది చెప్పటం ఇప్పుడు అత్యవసరమని లేకుంటే ఉగ్రవాద విషసర్పాలు విశ్వవిలయానికి దారితీస్తాయని అన్నారు.

 

చివరికి ప్రపంచ అభివృద్ధికి ఆటంకం గా మారిన పాకిస్థాన్ అనే ఉగ్రభూతానికి దాని ఉగ్రవాదాన్ని సమాధి చేయాలి అని సుష్మా స్వరాజ్ ఐరాసలో ఆవేశంగా ప్రసంగించారు. పాకిస్థాన్‌ని దాదాపు ఉతికి ఆరేసినంత పనిచేసిన సుష్మా స్వరాజ్ ప్రసంగం ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో సైతం వైరల్ అయింది. భారత్ తరపున పాకిస్థాన్ కి గట్టి హెచ్చరికే  ఇచ్చిన సుష్మా స్వరాజ్‌కి సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: