రాయలసీమ ప్రాంతానికి అందిస్తున్న తాగునీరు విషయం లో ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి చేస్తోంది సరైన పద్ధతి కాదు అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. దొంగతనం గా నీళ్ళు కాజేస్తున్నారు అన్నట్టు గా సాక్షి లో కథనాలు రావడం పట్ల చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ విషయం లో చంద్రబాబు స్పందన చూసిన వైకాపా మనిషి అంబటి రాంబాబు తన స్పందన తెలియజేసారు.


ప్రతి పక్ష నేత మీద బురద జల్లుడు కార్యక్రమం తప్ప టీడీపీ కీ చంద్రబాబు కీ మరే పనీ లేదు అని తేల్చి పడేసారు రాంబాబు. పోతిరెడ్డి పాడు జల వినియోగం గురించి ప్రతీ మీడియా సంస్థా ఇవే కథనాలు రాయగా సాక్షి కథనం ఒక్కటే వచ్చినట్టు అది జగన్ చెప్పిన మాట అన్నట్టు చంద్రబాబు మాట్లాడడం మూర్ఖత్వంగా ఉంది అన్నారు అంబటి.


మీడియాలో వ‌చ్చే క‌థ‌నాల‌ను వ్య‌క్తుల‌కు ముడిపెట్ట‌డం అనేది స‌రైన ప‌ద్ధ‌తి కాద‌న్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉండే ప‌త్రిక‌లు, ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ వాద‌న‌ను ప్ర‌తిబింబించేలా వార్త‌లు రాయ‌డంలో త‌ప్పేముంద‌ని నిల‌దీశారు. ఈ సంద‌ర్బంగా చంద్ర‌బాబు ఆహార‌పు అల‌వాట్ల గురించి కూడా అంబ‌టి ఎద్దేవా చేసేలా మాట్లాడారు.


అంబటి విమర్శలు సరే కానీ సాక్షి లో వార్త వస్తే జగన్ అభిప్రాయం అని ఎలా అంటారు అనేది ఆయన వాదన, ఇది సెల్ఫ్ గోల్ లాగా అనిపిస్తోంది. సాక్షి కి వైకాపా కీ ఏం సంబంధం లేదు అన్నట్టు మాట్లాడడం అంబటి చేస్తున్న కామెడీ గా అనిపించింది. వైకాపా కి సాక్షి అనుకూలం అనీ టీడీపీ కి ఆంధ్ర జ్యోతి లాంటివి అనుకూలం అని తెలిసినా కూడా ప్రజల చెవులలో క్యాబెజీలు పెట్టె ప్రయత్నాలు ఈ నేతలు ఎప్పటికి మానుకుంటారో .

మరింత సమాచారం తెలుసుకోండి: