సరిగ్గా పోయిన నవంబర్ లో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు కార్యక్రమం దేశాన్ని ఏ రకంగా కుదిపేసిందో మనం చూసాం. పెద్ద నోట్ల రద్దు కి సంబంధించి అప్పట్లో అనేక విమర్శలు వచ్చినా కూడా ఎక్కడా వెనక్కి తగ్గలేదు మోడీ సర్కారు .తన నిర్ణయాల మీద గట్టిగా నిలబడే అలవాటు ఉన్న మోడీ ఇప్పటికీ ఈ విషయం మీద తన తప్పు ఉంది అని కానీ అది తప్పుడు నిర్ణయం అని కానీ ఎక్కడా ఒప్పుకోలేదు.


అయితే ఒకప్పటి ఆర్ధిక మంత్రి మాజీ ప్రధాని కాంగ్రెస్ ప్రస్తుత నేత మన్మోహన్ సింగ్ ఈ విషయం మీద ఇన్నాళ్ళ తరవాత నోరు విప్పారు. మాజీ ప్రధానిగా కాక ఒక ఆర్ధిక వేత్తగా మాట్లాడిన ఆయన మొహాలీ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లీడర్ షిప్ సమ్మిట్ లో పెద్ద నోట్ల రద్దు గురించి చెప్పుకొచ్చారు. 


పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమంలోకి వెళ్లిపోయిందన్నారు. ఇదొక గొప్ప సాహసం అనీ ఈ సాహసం వలన ఒక్కరికీ ఉపయోగం కూడా లేకుండా పోయింది అనీ లాటిన్ అమెరికా లాంటి దేశాల లోనే ఈ పెద్ద నోట్ల రద్దు విజయవంతం అవ్వలేదు అని మోడీ గుర్తించాలి అన్నారు మన్మోహన్. అక్కడ ఉన్న పిల్లలలో కొందరు అడిగిన ' నోట్ల రద్దు సరైనదేనా ' అనే ప్రశ్నకి ఆయన బదులు ఇచ్చారు.


చలామణిలో ఉన్న 86 శాతం నగదును ఉపసంహరించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగిందన్నారు. నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ల వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉండే అవకాశం ఉందని, అయితే తాత్కాలికంగా మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: