ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి మీద టీడీపీ వింతైన విమర్శలు చేయడం లో బిజీ గా ఉంది. ప్రతిపక్ష నేత అనే వ్యక్తి రాయలసీమకి పూర్తిగా వ్యతిరేకి అనీ ఇక్కడ డవలప్మెంట్ ఏదైనా జరుగుతూ ఉంటె దాన్ని అడ్డుకోవడం లో అతను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు తప్ప ప్రజా సమస్యల మీద అతనికి మినిమం అవగాహన లేదు అనేది టీడీపీ తాజాగా చేస్తున్న ఆరోపణ.


ఏదో చిన్నా చితకా టీడీపీ లీడర్ లు కాదు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆ మాట అనేసారు. పోతిరెడ్డిపాడు నుంచి సీమ‌కు నీళ్లు తెస్తుంటే జ‌గ‌న్ అడ్డుకుంటున్నార‌నీ, ఆయ‌న రాయ‌ల‌సీమ‌కి చెందిన‌వారా, తెలంగాణ‌కు చెందినవారా అనే అనుమానం క‌లుగుతోంద‌ని విమ‌ర్శించారు.


ఇప్పుడు అదే మాట ప‌ట్టుకుని టీడీపీ నేత‌లంతా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. టీడీపీ సైద్ధాంతికం గా రాయలసీమ మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది అనడానికి ఈ ఒక్క అంశం ఉదాహరణ గా తీసుకోవచ్చు. ఏదో మామూలు విమర్శలు గా టీడీపీ వీటిని చేయడం లేదు దీని వెనకాల వైకాపా ఇమేజ్ ని రాయలసీమ లో దాదాపుగా తగ్గించాలి అనే ప్రతిపాదన ఉండనే ఉంది.


జగన్ మీద అక్కడివారిలో వ్యతిరేక భావం కలిగించడం కోసం అన్నట్టు వారి మాటలు సాగుతున్నాయి. ఈ లక్ష్యాన్ని వైకాపా ఎలా అడ్డుకుంటుంది? అసలు ఈ లాజిక్ వారి వరకూ వెళ్ళిందా లేదా అనేది కీలకం.

మరింత సమాచారం తెలుసుకోండి: