కెసిఆర్ సర్కారు కి తామే ప్రత్యామ్న్యాయం అని తెలంగాణా లో చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ లోలోపల జరుగుతున్న కుమ్ములాటల వలన చాలానే నష్ట పోతోంది. లాంగ్రేస్ నేతలు సరైన వ్యూహరచన అనేది ఏదీ లేకుండా కార్యాచరణ కి దిగుతున్నారు అనే అపవాదు ఉంది. సరైన ఫలితాలు సాధించడం లో టీ కాంగ్రెస్ ఓడిపోతోంది అని మీడియా సైతం చెబుతోంది.


కెసిఆర్ చేపడుతున్న కొత్త సచివాలయం నిర్మాణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు విపరీతంగా చేస్తోంది. అయితే ఈ విషయం మీద ప్రజల మద్దతు కూడగట్టుకోవడం కోసం ఒక కొత్త ప్రయత్నానికి కాంగ్రెస్ తెర లేపింది. సచివాలయం అనేది అసలు ఇప్పటికే ఉండగా కొత్తగా సచివాలయం అవసరమా అంటూ ఓటింగ్ నిర్వహించ బోతోంది ఈ పార్టీ.ఈ నెల 26 ఓటింగ్ జ‌రుగుతుంద‌నీ, ఉద‌యం 10 నుంచి సాయంత్రం 6 వ‌ర‌కూ 20 కేంద్రాల్లో ఓటింగ్ ఏర్పాట్లు చేస్తున్నామనీ చెబుతున్నారు ఆ పార్టీ వారు.


తరవాతి రోజునే ఫలితాలు సైతం వెల్లడిస్తారు. బ్యాలెట్ ద్వారా ప్ర‌జ‌లు త‌మ వ్య‌తిరేక‌త‌ను చెప్పాల‌నీ, ఆ త‌రువాతైనా ముఖ్య‌మంత్రి ఆలోచ‌నా విధానంలో మార్పు వ‌స్తుందేమో చూద్దామ‌ని అన్నారు. సచివాలయం కి వ్యతిరేకంగా పోరాడడం వరకూ ఓకే కానీ ఈ విషయం లో టీ కాంగ్రెస్ వారు ప్రజాభిప్రాయం కూడగట్టడం కోసం ఓటింగ్ కి వెళ్ళడం అనేది సరైన ఐడియా కాదు అంటున్నారు చాలా మంది. 20 కేంద్రాలు ఏర్పాటు చేసి, అక్క‌డి ప్ర‌జ‌లు వ‌చ్చి ఓట్లు వేయాల‌ని అంటున్నారు.


ఇక్క‌డే అస‌లు స‌మ‌స్య ఉంది. ప్ర‌స్తుతం ద‌స‌రా పండుగ సెల‌వు రోజులు, పైగా ఓటింగ్ నిర్వ‌హిస్తున్న‌ది కూడా పని దినాల్లోనే. అలాంట‌ప్పుడు సాధార‌ణ ప్ర‌జ‌లు ఎందుకొస్తారు..? ఇలా ఎన్నో ఇబ్బందుల మధ్యన ఓటింగు అంటే తమ గొయ్యి తామే తొవ్వుకుంటూ ఉన్నారు కాంగ్రెస్స్ వారు 

మరింత సమాచారం తెలుసుకోండి: