జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రూటు మారిందా ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్ తాను అనంత‌పురం జిల్లా నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని చెప్పారు. దీంతో ప‌వ‌న్ అనంత‌పురం జిల్లాలో ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తాడు ? అనే దానిపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు నడిచాయి. ప‌వ‌న్ అనంత‌పురం జిల్లాలోని అనంత‌పురం అర్బ‌న్‌, గుత్తి, క‌దిరి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తాడ‌ని ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌చ్చాయి. 

pawan kalyan janasena కోసం చిత్ర ఫలితం

ప‌వ‌న్ అనంత‌పురం జిల్లా నుంచే పోటీ చేస్తాన‌ని చెప్ప‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ - అనంత‌పురం పోటీమీదే చ‌ర్చించుకుంటున్నారు. అయితే ఇప్పుడు జ‌న‌సేన వ‌ర్గాల్లో ఇన్న‌ర్ టాక్ ప్ర‌కారం ప‌వ‌న్ అనంత‌పురం జిల్లా నుంచి పోటీ సంగ‌తి ఎలా ఉన్నా టీడీపీ కంచుకోట నుంచి కూడా పోటీ చేస్తార‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఉభ‌య గోదావ‌రి జిల్లాల పేరు చెపితే టీడీపీకి కంచుకోట అన్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో అయితే గ‌త ఎన్నిక‌ల్లో 15 ఎమ్మెల్యే సీట్ల‌తో పాటు రెండు ఎంపీ సీట్ల‌లోను టీడీపీ జెండా ఎగిరింది.


ఇదిలా ఉంటే టీడీపీకి ముందునుంచి కంచుకోట‌గా ఉన్న ఈ జిల్లా నుంచి కూడా ప‌వ‌న్ అసెంబ్లీ బరిలో ఉంటాడ‌ని తెలుస్తోంది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2009 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ అన్న చిరు ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తిరుప‌తిలో గెలిచిన ప‌వ‌న్ ఇక్క‌డ మాత్రం ఓడిపోయారు. ఇది అల్లు అర‌వింద్ సొంత ఊరు. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌క్క‌నే ఉన్న న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని మొగ‌ల్తూరు ప‌వ‌న్‌, చిరు స్వ‌గ్రామం. 

palkollu కోసం చిత్ర ఫలితం

దీంతో అన్న ఓడిపోయిన చోటే తాను పోటీ చేసి గెల‌వాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ప‌వ‌న్ ఉన్న‌ట్టు స‌మాచారం. ఈ మేర‌కు జ‌న‌సేన వ‌ర్గాలు పాల‌కొల్లులో రెండుమూడుసార్లు స‌ర్వేలు కూడా చేసిన‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ ఇక్క‌డ నుంచి పోటీ చేస్తే త‌మ‌కు అనుకూలంగా ఉంటుంద‌ని కూడా స‌ర్వేల్లో తేలింద‌ట‌. ప‌వ‌న్ కాపు సామాజిక‌వ‌ర్గం ఓట‌ర్లు నియోజ‌క‌వ‌ర్గం ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్నారు. ఇక్క‌డ రెండో ప్లేస్‌లో ఉన్న బీసీల్లో బ‌ల‌మైన శెట్టిబ‌లిజ వ‌ర్గం ఓట‌ర్లు కూడా బ‌లంగా ఉన్నారు. వీరిలో ప‌వ‌న్ మ‌ద్ద‌తుదారులు ఎక్కువ‌. ఇక మిగిలిన వ‌ర్గాల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌వ‌న్‌కు భారీగా అభిమానులు ఉన్నారు.


ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ పాల‌కొల్లుపై ఆస‌క్తి క‌న‌ప‌రుస్తున్నారు. ప‌వ‌న్ పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గాన్నే ముందు ఆప్ష‌న్‌గా ఎంచుకుని, అనంత‌పురంను రెండో ఆప్ష‌న్‌గా ఎంచుకుంటార‌ని తెలుస్తోంది. ప‌లు స‌ర్వేల అనంత‌రం ప‌వ‌న్ అనంత‌పురం కంటే పాల‌కొల్లులో పోటీ చేసేందుకు అనువైన ప‌రిస్థితులు ఉన్నాయ‌న్న లెక్క‌కు వ‌చ్చిన‌ట్టు జ‌న‌సేన వ‌ర్గాల ద్వారా మ్యాట‌ర్ లీక్ అయ్యింది. అయితే ప‌వ‌న్ పోటీ విష‌యంలో టీడీపీతో జ‌న‌సేన పొత్తు ఉంటుందా ?  లేదా ? అన్న దానిపై కూడా ఆయ‌న పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గం మారే ఛాన్స్ ఉంది.


janasena images కోసం చిత్ర ఫలితం




మరింత సమాచారం తెలుసుకోండి: