రాజ‌కీయాల్లో ప్రేమ‌, స్నేహితులు, ప్రాణ స్నేహితులే కాదు చివ‌ర‌కు బంధుత్వాలు, ర‌క్త సంబంధాలు కూడా దూర‌మ‌వుతాయి. రాజ‌కీయాల‌కు సెంటిమెంట్లు, ఎమోష‌న్లు ఉండ‌వు. ఇక్క‌డ అంతా ప‌గ‌, ప్ర‌తీకారాలు, ఎత్తులు, పై ఎత్తులే ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఇదే రాజ‌కీయాలు ఇద్ద‌రు బెస్ట్ ఫ్రెండ్స్ మ‌ధ్య చిచ్చుకు కార‌ణ‌మ‌య్యాయి. తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌కు చెందిన ఇద్ద‌రు ప్రాణ స్నేహితుల మ‌ధ్య ఇప్పుడు ఎమ్మెల్యే సీటు కోసం వార్ జ‌రుగుతోంది. వీరిద్ద‌రు క‌త్త‌లు దూసుకుంటుంటే, వీరి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది.

ramavath ravindra naik కోసం చిత్ర ఫలితం

తెలంగాణ‌లోని న‌ల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే రవీంద్రకుమార్, నల్లగొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ బాలూ నాయక్. ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. వీరిలో బాలూ నాయ‌క్ ముందు నుంచి కాంగ్రెస్ నేత‌. ఇక ర‌మావ‌త్ ర‌వీంద్ర‌కుమార్ వామ‌ప‌క్ష భావ‌జాలానికి ఆక‌ర్షితులై సీపీఐలో చేరారు. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో పొత్తు నేప‌థ్యంలో దేవ‌ర‌కొండ సీటు నుంచి సీపీఐ త‌ర‌పున పోటీ చేసిన ర‌వీంద్ర‌కుమార్ ఎమ్మెల్యేగా గెలిచారు.


ఇక కాంగ్రెస్ త‌ర‌పున జ‌డ్పీచైర్మ‌న్‌గా గెలిచిన బాలూ నాయ‌క్ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి అండ‌తో టీఆర్ఎస్‌లో చేరారు. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌న్న ప్లాన్‌తోనే ఆయ‌న పార్టీ మారారు. అయితే త‌ర్వాత అనూహ్య ప‌రిణామాల మ‌ధ్య సీపీఐ నుంచి తెలంగాణ‌లో ఏకైక ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్రకుమార్ కూడా వామ‌ప‌క్ష సిద్దాంతాల‌కు తిలోద‌కాలిచ్చి.. 2016లో గులాబీ కండువా కప్పుకున్నారు. రవీంద్రకుమార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిని నమ్ముకుని గులాబీ పార్టీలో ఆయనతో పాటు చేరిపోయారు.  

zp chairman balu naik కోసం చిత్ర ఫలితం

ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే కావ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ర‌వీంద్ర‌కుమార్‌కే దేవ‌ర‌కొండ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సీటు ఇస్తార‌న్న ప్ర‌చారం స్టార్ట్ అయ్యింది. దీంతో ఇప్పుడు నియోజక‌వ‌ర్గంలో బాలు నాయ‌క్ వ‌ర్సెస్ ర‌వీంద్ర‌నాయ‌క్ మ‌ధ్య ఆధిప‌త్య పోరు తీవ్ర‌మైంది. రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, బతుకమ్మ చీరల పంపిణీ,  భూరికార్డుల గ్రామసభల్లో ఇలా ప్ర‌తి విష‌యంలో వీరి అనుచ‌రులు రెండు వ‌ర్గాలుగా విడిపోయి ఫైటింగ్‌కు దిగుతున్నారు. వీరిద్దరి మధ్య పంచాయితీని సెటిల్ చేసేందుకు మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి విఫ‌ల ప్ర‌య‌త్నాలు చేశారు.


ఇలా బెస్ట్ ఫ్రెండ్స్ మ‌ధ్య వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే సీటు ఇప్పుడు అగ్గి రాజేసింది. ప్ర‌స్తుతం దేవ‌ర‌కొండ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య వార్ ఓ రేంజ్‌లో ఉంది. మ‌రి ఈ వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ ప‌డుతుందో ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో దేవ‌ర‌కొండ టీఆర్ఎస్ టిక్కెట్ ఎవ‌రికి ద‌క్కుతుందో ?  చూడాలి.

trs party logo కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: