ఈ ఏడాది జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న అతిపెద్ద నిర్ణయం గా చెబుతున్న 'పాదయాత్ర' కి ఆది లోనే అడ్డం పడే పరిస్థితి ఉందా ? అవును అనే అంటున్నాయి లోటస్ పాండ్ వర్గాలు. అక్టోబర్ 27 నుంచీ అట్టహాసం గా జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు అయితే ఇది వాయిదా పడే సూచనలు కనపడుతున్నాయి అని సమాచారం.


అక్టోబర్ 27 న రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేస్తా అంటూ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జగన్ అక్టోబర్ 27 శుక్రవారం అవుతుంది అనే విషయం తెలిసి చెప్పారో తెలీక చెప్పారో లేక కోర్టు పర్మిషన్ వచ్చి తీరుతుంది అనే కాన్ఫిడెన్స్ తో చెప్పారో కానీ ప్రతీ శుక్రవారం ఆయన కోర్టులో హాజరు కావాల్సి ఉన్నది.


కోర్ట్ ప్రతి శుక్రవారం వ్యక్తిగత హాజరు నుంచి జగన్ ని మినహాయించడానికి తిరస్కరించిన దరిమిలా పాదయాత్ర ని ఎలా కొనసాగించాలనేది ప్రశ్నగా మారింది. అందులోనూ ప్రారంభమే శుక్రవారం పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా తేదీ మార్చాల్సిన అవసరం ఏర్పడింది.


ఆ తేదీ ని మార్చాల్సిన పరిస్థితి ఇప్పుడు జగన్ కి ఎదురైంది, అయితే ముహూర్త బలం లేకనే ఆ డేట్ ని మారుస్తున్నట్టు వైకాపా లో ఇప్పటికే న్యూస్ పుట్టింది. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటూ ఎల్లో మీడియా ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టింది. ప్రతీ విషయం మీదా ఎవరి వాదనలు వాళ్ళు వినిపించడం లో కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీడియా వారు.

మరింత సమాచారం తెలుసుకోండి: