కాంగ్రెస్ పార్టీ లో ఉన్నంత కాలం ఆయన ఒక తిరుగు లేని లీడర్, పార్టీ విషయం లోనే కాదు టోటల్ తెలంగాణా రాజకీయం లో ఒక వెలుగు వెలిగి, చక్రం తిప్పగల నేతగా ఆయన కి మంచి పేరుంది. తెలుగు రాష్ట్రం విడిపోయిన టైం లో కాంగ్రెస్ తరఫున బరిలో దిగి ఓడిపోయి , గులాబీ దళం లో చేరిపోయారు  ఆయన.


అక్కడ కూడా తన హవా కొనసాగిద్దాం అనుకున్న ఆయన కి పరిస్థితి అడ్డం తిరిగింది. గులాబీ బండి ఎక్కగానే రాజ్యసభ సీటు ఇచ్చి సలహాదారు హోదా ఇచ్చారు. కానీ ఆయన భవిష్యత్తు విషయం లో మాత్రం ఇంకా ప్రశ్నలు బోలెడు ఉన్నాయి.


ఇంతకీ ఇప్పటి వరకూ మాట్లాడిన వ్యక్తి ఎవరో మీకు అర్ధమైందా ? ఆయనే డీ శ్రీనివాస్ .. ఈ మ‌ధ్య త‌ర‌చూ డీఎస్ పేరు వార్త‌ల్లో ఉంటోంది. కార‌ణం.. ఆయ‌న పార్టీ మార‌తార‌నే చ‌ర్చ‌. ఎప్ప‌టిక‌ప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఖండిస్తున్నా.. ఆ క‌థ‌నాల‌కు ఫుల్ స్టాప్ ప‌డ‌లేదు. దీంతో డీఎస్ పైనా ఆయ‌న అనుచ‌ర వ‌ర్గం మీదా గులాబీ బాస్ నిఘా పెట్టించిన‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.


ఉన్న‌ట్టుండి ఇలా నిఘా పెట్ట‌డం వెన‌క కార‌ణాలు కూడా ఉన్నాయి. శ్రీనివాస్ చిన్న కొడుకు అరవింద్ ఈ మధ్య బీజేపీ లో చేరాడు, రాజకీయాలలో తండ్రి దారిలో కలవడం కుదరదు అని చెప్పేసిన అరవింద్ తన తండ్రి దరి తనది అనీ తన దారి తనది అనీ తేల్చేసాడు. ఈయన కూడా తన కొడుకు నిర్ణయం వ్యక్తిగతం అనే చెప్పారు. అయితే కెసిఆర్ కి ఈ విషయం లో చాలా కోపమొచ్చింది, బీజేపీ లో తన కొడుకు జేరతాడు అని ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయేలా చెయ్యడం ఏంటి అనేది కెసిఆర్ లాజిక్. అందుకే, డీఎస్ వ‌ర్గీయుల ప‌రిస్థితి ఏంటీ, వాళ్ల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌లేంటీ, భాజ‌పాకు చేరువ‌య్యేలా డీఎస్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా లేదా.. ఇలాంటి అంశాల‌పై ఓ క‌న్నేసి ఉంచిన‌ట్టు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: