భూపాల పల్లి జిల్లాలో పర్యటన కి వచ్చిన రేవంత్ రెడ్డి అక్కడ గుత్తి కోయలుగా ఉంటూ ఎదురుకొంటున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. గుత్తి కోయలో లోకల్ వారు కాదు అంటూ అక్కడ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని తెలుసుకున్న రేవంత్ వెంటనే అక్కడికి చేరుకున్నారు.


ప్రభుత్వం అన్యాయంగా వారిని దాడులకి గురి చేస్తోంది అనీ చట్టాన్ని పక్కన పెట్టి మరీ పోలీసులు కెసిఆర్ కి తొత్తులుగా మారుతున్నారు అనీ రేవంత్ ఆరోపించారు. " అసలు కెసిఆర్ ఇక్కడి వ్యక్తా ? మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన మాత్రం తెలంగాణా వాడేనా ? కాదు ఆయన ఒక వలస దారుడు.


వలస వచ్చిన వ్యక్తులని అక్కున చేర్చుకోవడం తెలంగాణా కి మొదటి నుంచీ ఉన్న అలవాటే .. అకారణంగా గుత్తి కోయలు జాతివారి మీద దాడులు చెయ్యడం అమానుషంగా వారితో పోలీసులు ప్రవర్తించడం చూస్తూ ఉంటె మనం ఇరవై ఒకటవ శతాబ్దం లో ఉన్నామా మరెక్కడైనా ఉన్నామా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి." అన్నారు రేవంత్ రెడ్డి.


తెలుగుదేశం నేతలతో కలసి ఓ గూడేన్ని సందర్శించిన ఆయన, కేసీఆర్ పూర్వీకులు బీహార్ నుంచి, విజయనగరానికి, ఆ తరువాత తెలంగాణకు వలస వచ్చారని గుర్తు చేసిన ఆయన, తన కొడుకుకు ఆయన గుంటూరులో చదువు చెప్పించుకున్నారని, ఆ తరువాతే అమెరికాకు పంపారని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: