రీసెంట్ గా చంద్రబాబు నాయుడు ప్రకటించిన కార్యవర్గాల లో సంచలనాలు ఊహించారు కానీ అలాంటివి ఏమీ జరగలేదు. ఫిరాయింపు దారులకి పెద్ద పీట వేస్తున్నారు అనే మాట పార్టీ విధేయుల నోట్లోంచి మొదటి నుంచీ వినిపిస్తున్నదే ఈ సారి ఇంకాస్త ఎక్కువగా వినపడింది అంతే. చంద్రబాబు జాతీయ అద్యక్షుడుగా లోకేశ్‌, ఇ.పెద్దిరెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ప్రకటించారు.


ఇదంతా గంభీరంగా కనిపించేందుకు లోకేశ్‌కు పార్టీలో స్థానాన్ని అట్టిపెట్టేందుకు చేసే పని తప్ప రాజకీయంగా ఇతర జాతీయ పదవులకు పెద్ద ప్రాధాన్యత లేదని టిడిపి నాయకులు తేల్చిచెబుతున్నారు.


జాతీయ ముద్ర వేసుకోవాలి అన్న కాంక్ష ఒకప్పుడు చంద్రబాబు లో గట్టిగానే కనపడేది. చుట్టూ పక్కల రాష్ట్రాలలో సీట్లు రాపోయినా పర్లేదు కానీ ఓట్ల శాతం తెప్పించుకుని జాతీయ పార్టీ అనిపించుకోవాలి అనేది ఆయన కోరికగా ఉండేది. కేంద్రం తో అది స్నేహానికి మరింత బలాన్ని ఇస్తుంది అనేది ఆయన లాజిక్.


కానీ ఇప్పుడు ఆ ఆలోచన ని ఆయన విరమించుకున్నట్టు అనిపిస్తోంది. పక్క రాష్ట్రం  , ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రాంతం తెలంగాణా లోనే టీడీపీ కి నూకలు చెల్లడం లేదు. తమిళనాడులో జయలలిత వుంటే ఏవైనా అప్రధానమైన సీట్లు తెచ్చుకోవడానికి అవకాశం వుండేదేమో.. ఆపైన తెలుగువారు ఎక్కువ వుండే మరేదైనా రాష్ట్రంలోనూ ఓట్లు తెచ్చుకుంటే సరిపోయేది. ఇప్పుడదంతా మారింది. తమిళనాడు అస్తవ్యస్తంగా వుంది.జాతీయ ఆశలు చంద్రబాబు నెమ్మదిగా కోల్పోయారు అనే అంటున్నారు విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: