గత కొన్ని రోజుల నుంచి తమిళనాట రాజకీయాల్లో వస్తున్న మార్పులు చేర్పులు, ప్రతిరోజు సంచలన కథనాలు వస్తూనే ఉన్నాయి.  తాజాగా తమిళనాట రాజకీయాల్లోకి సినీ స్టార్స్ సందడి చేయబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.   ఈ నేపథ్యంలో విశ్వనటుడు కమల్ హాసన్ ఏకంగా కొత్త పార్టీ పెట్టి రాజకీయ ప్రక్షళణ చేయబోతున్నాడని వార్తలు దావానంలా వ్యాపించాయి.  ఇక కమల్ రాజకీయ రంగ ప్రవేశం పై ఇప్పటికే సూచనప్రాయంగా కొన్ని సంకేతాలు ఇవ్వడంతో ఆయన పై విమర్శల పర్వం మొదలయ్యింది.
Image result for kamal hassan kejriwal
 ఇవేవీ పట్టించుకోకుండా కమల్ హాసన్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.  ఈ మద్య ఆప్ అధినేత కేజ్రీవాల్ ని కూడా కలిశారు. మరోవైపు కమల్ హాసన్ అద్భుతమైన నటన కనబర్చగలరు కానీ..రాజకీయాలు ఆయన వల్ల కావని..రాణించలేడు అని అలాగే రాజకీయాలలో మనగలగడం అంత సులువు కాదు అని వ్యాఖ్యానించారు ఓ మంత్రివర్యులు.  
Image result for kamal hassan rajini
గతంలో ప్రజల వద్ద తనకు అద్భుతమైన క్రేజ్ ఉందని... రాజకీయాలను తేలికగా అంచనా వేసి తమకి ప్రజల మద్దతు ఉందన్న బ్రమలో ఈయన కూడా నటుడు శివాజీ గణేషన్ లా తప్పుడు అంచనాతో ప్రజల మధ్యలోకి వెళ్ళి ఎదురుదెబ్బ తిన్న విషయం కమల్ హాసన్ గుర్తుంచుకోవాలని సూచించారు.  ఇంకొక మూడు నెలల్లో ఆయన రాజకీయ రంగప్రవేశం ఉండబోతున్నది అన్న వార్తల నడుమ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: