ప్రంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా అమెరికా, ఉత్తర కొరియాల మద్య జరుగుతున్న మాటల యుద్దం గురించే వినిపిస్తుంది.  అమెరికాను సమూలంగా నాశనం చేస్తానని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ అంటుంటే..అంత దమ్ము ధైర్యం వాళ్లకు ఉందా అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు.  గత కొన్ని రోజులుగా వీరి మద్య మాటల తూటాలు పేలుతున్న సందర్భంలో కిమ్ జాంగ్ పలు మార్లు క్షిపణి ప్రయోగాలు చేస్తూ వచ్చారు.
అంతకుముందు అమెరికా ఖండన
తాజాగా  ఉత్తర కొరియాపై సైనిక చర్య చేపట్టేందుకు సర్వం సిద్ధం చేసుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. యూఎస్ బాంబర్లను తాను కూల్చివేయగలమని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని నార్త్ కొరియా విదేశాంగ మంత్రి ప్రకటించిన మరుసటి రోజు ట్రంప్ స్పందించారు. 'సైనిక చర్య' అన్న పదం తమ తొలి ఆప్షన్ కాదని, రెండో ఆప్షన్ గానే దాన్ని ఎంచుకున్నామని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. 
యుద్ధానికి సిద్ధమే కానీ, అది రెండో ఆప్షన్
ఉత్తర కొరియాతో యుద్ధానికి సిద్ధమేనని ట్రంప్ ప్రకటించారు. అయితే అది కేవలం రెండో ఆప్షన్ మాత్రమే అన్నారు. అవసరమైతే, యుద్ధం వస్తే మాత్రం తాము సిద్ధమని ప్రకటించారు. అదే కనుక జరిగితే ఉత్తర కొరియా పూర్తిగా నాశనమవుతుందని చెప్పగలనని ట్రంప్ అన్నారు. కొరియాను పూర్తిగా నాశనం చేసేందుకు అమెరికా సిద్ధమన్నారు.
Image result for north korea
ఒకవేళ తాము రంగంలోకి దిగితే మాత్రం పూర్తి విజయం సాధించే వరకూ వదిలేది లేదని స్పెయిన్ ప్రధాని మారియానో రజోయ్ తో కలసి పాల్గొన్న సంయుక్త మీడియా సమావేశంలో ట్రంప్ తెలిపారు. కిమ్ జాంగ్ ఉన్ చాలా చెడు ప్రవర్తనను చూపిస్తున్నారని, గతంలో ఎన్నడూ లేనంతగా రెచ్చిపోతున్నారని ట్రంప్ ఆరోపించారు. 
Image result for north korea bomb
మొదట ట్రంప్ ఉత్తర కొరియాపై యుద్ధం ప్రకటించాడన్న వార్తలను అంతకుముందు వైట్ హౌస్ ఖండించింది. అది అబద్దపు ప్రచారమని వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి శారా శాండర్స్ అన్నారు. కానీ మరుసటి రోజే తాము యుద్ధానికి సిద్ధమని ట్రంప్ ప్రకటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: