ఫేస్ బుక్ vs డోనాల్డ్ ట్రంప్ అన్నట్టు నడుస్తోంది ప్రస్తుతం కథ. సోషల్ మీడియా లో అగ్రగామిగా ఉన్న ఫేస్ బుక్ సంస్థ తన బలం వాడుతూ విమర్శలనే ఎక్కువగా ప్రచారం చేస్తోంది అంటూ ట్రంప్ విమర్శలు గుప్పించారు.


వాషింగ్టన్ పోస్ట్ లాంటి ప్రముఖ పత్రికలు సైతం తనని వ్యతిరేకించేవిధంగా పని చేస్తున్నాయి అంటూ ట్రంప్ సీరియస్ అయ్యారు. దీనికి ఫేస్ బుక్ సీయీఓ మార్క్ జుకర్ బర్గ్ స్పందించారు.  ఇక దీనిపై మార్క్ స్పందిస్తూ, ఎవరు ఎటువంటి ఆలోచనను, అభిప్రాయాన్నైనా తమ ప్లాట్ ఫామ్ పై పంచుకోవచ్చని, ఆ స్వాతంత్ర్యం ప్రతి ఒక్కరికీ ఉందని అన్నారు.


అదే స్వాతంత్ర్యంతో ట్రంప్ కూడా ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ మధ్యన ఫేక్ న్యూస్ ఎక్కువగా ఇంటర్నెట్ లో వ్యాపింప జేస్తున్నారు అనే అపవాదు ఉండనే ఉంది. గత సంవత్సరం అధ్యక్షా ఎన్నికల టైం లో అమెరికన్ ఓటర్లని ప్రభావితం చేసేందుకు రష్యా నుంచి ఫేస్ బుక్ మాధ్యమం వాడుకున్నారు అన్న విమర్శలు ఉన్నాయి.


తమ సామాజిక మాధ్యమ ప్లాట్ ఫారాలపై సాధ్యమైనంత వరకూ తప్పుడు సమాచారం లేకుండా చూడాలన్నదే తమ అభిమతమని, ఓ చిన్న సమాచారం తప్పని తెలిసినా వెంటనే సరిచేసుకుంటామని జుకర్ బర్గ్ వ్యాఖ్యానించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: